ఆర్ఆర్ఆర్‌లో అవి లేపేస్తున్నారా?

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో భారీ ఎత్తున రిలీజ్ చేయాలని జక్కన్న అండ్ టీమ్ భావిస్తున్నారు.

 Rrr Movie To Cut Few Songs, Rrr, Rajamouli, Ntr, Ram Charan, Songs-TeluguStop.com

దీంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.కాగా ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ శాతం పూర్తవ్వగా కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడింది.దీంతో ఈ సినిమా రిలీజ్‌పై తీవ్ర ప్రభావం పడింది.

ఇప్పటికే ఈ సినిమాను జూలై 2020 నుండి జనవరి 2021కు వాయిదా వేశారు చిత్ర యూనిట్.కాగా ఇప్పుడు కరోనా కారణంగా ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని జక్కన్న భావిస్తున్నాడు.

అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమాను వేసవిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీగా లేనట్టు తెలుస్తోంది.

అనుకున్న సమయానికి సినిమా షూటింగ్‌ను ముగించి వేసవిలో రిలీజ్ చేసేందుకు ఈ సినిమాలో భారీ మార్పులు చేసేందుకు జక్కన్న రెడీ అయ్యాడట.

ఈ సినిమాలో వచ్చే కొన్ని పాటలను పూర్తిగా లేపేయాలని ఆయన అనుకుంటున్నాడు.దీంతో కథలో ఎలాంటి మార్పులతో ఈ సినిమా వస్తుందా అని అందరూ అనుకుంటున్నారు.మరి ఆర్ఆర్ఆర్‌లో ఎలాంటి పాటలను లేపేస్తున్నారో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube