చరణ్, తారక్ కు భారీ షాక్.. ఆర్ఆర్ఆర్ మార్కెట్ విలువ 30 శాతం తగ్గిందా?

Rrr Movie Theatrical Value Prices Decreased Hugely Why Because

2018 సంవత్సరంలో ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే.రాజమౌళి బాహుబలి తర్వాత దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ ఉన్న చరణ్, ఎన్టీఆర్ ఒకే సినిమాలో కలిసి నటించడంతో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది.

 Rrr Movie Theatrical Value Prices Decreased Hugely Why Because-TeluguStop.com

అయితే కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత పరిస్థితులు మారిపోయాయి.గతంలోలా ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూసే పరిస్థితి లేదు.

మరోవైపు ఓటీటీల హవా కొనసాగుతుండటంతో కొంతమంది ప్రేక్షకులు సినిమా ఓటీటీలో రిలీజైన తర్వాత చూద్దామనే భావనను కలిగి ఉన్నారు.మారిన పరిస్థితుల వల్ల, ఏపీలో టికెట్ రేట్ల తగ్గింపు వల్ల ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించిన మార్కెట్ విలువలో మార్పులు చేశారని తెలుస్తోంది.

 Rrr Movie Theatrical Value Prices Decreased Hugely Why Because-చరణ్, తారక్ కు భారీ షాక్.. ఆర్ఆర్ఆర్ మార్కెట్ విలువ 30 శాతం తగ్గిందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఫ్యామిలీలు థియేటర్లకు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.ఉత్తరాంధ్ర ఏరియాకు సంబంధించి ఆర్ఆర్ఆర్ థియేట్రికల్ హక్కులు 26 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.

మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆ మొత్తాన్ని 19 కోట్ల రూపాయలకు కుదించారని తెలుస్తోంది.

Telugu 19 Crore Rupees, 400 Crore Rupees, Corona Effect, Ntr, Prices Decreases, Rajamouli, Ram Charan, Rrr Business, Rrr Movie, Theatrical Value, Tollywood-Movie

ఈస్ట్ ఏరియాకు సంబంధించి 18 కోట్ల రూపాయల రేషియోలో డీల్ సెట్ కాగా 13 కోట్ల రూపాయలకు తగ్గించడం జరిగింది.గతంలో ఏపీలో 98 కోట్ల రేషియోలో బిజినెస్ జరగగా మేకర్స్ ఆ మొత్తాన్ని 68 కోట్ల రూపాయలకు తగ్గించుకున్నారని సమాచారం.ఓవర్సీస్ హక్కుకు సంబంధించి కూడా స్వల్పంగా మార్పులు జరిగే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.

Telugu 19 Crore Rupees, 400 Crore Rupees, Corona Effect, Ntr, Prices Decreases, Rajamouli, Ram Charan, Rrr Business, Rrr Movie, Theatrical Value, Tollywood-Movie

ఇతర స్టార్ హీరోల సినిమాలకు సైతం బిజినెస్ ఒప్పందాలను సమీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు ప్రచారం జరుగుతోంది.మరోవైపు ఆర్ఆర్ఆర్ రన్ టైమ్ 2 గంటల 45 నిమిషాలుగా ఉండనుంది.దీపావళికి రిలీజ్ కాబోయే టీజర్ లో ఎలాంటి డైలాగ్స్ ఉండవని సమాచారం.400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

#Crore Rupees #Rrr #RRR #Rajamouli #Theatrical

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube