#RRR ఎక్స్‌క్లూజివ్‌ అప్‌డేట్‌ : టీజర్ కు డేట్ ఫిక్స్ చేసిన జక్కన్న

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల కు సిద్దం అయ్యింది.ఇప్పటికే విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వడం జరిగింది.

 Rrr Movie Teaser Release Date News-TeluguStop.com

సినిమాను అదుగో ఇదుగో అంటూ వాయిదా లు వేసి ఎట్టకేలకు విడుదల చేసేందుకు సిద్దం చేస్తున్నారు.కరోనా వల్ల ఆలస్యం అయిన సినిమా ను వచ్చే జనవరిలో 7వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా క్లారిటీ ఇచ్చారు.

ఇక ఈ సినిమా నుండి టీజర్ ను విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.అయితే టీజర్ ను మొన్నటి వరకు దీపావళికి విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది.

 Rrr Movie Teaser Release Date News-#RRR ఎక్స్‌క్లూజివ్‌ అప్‌డేట్‌ : టీజర్ కు డేట్ ఫిక్స్ చేసిన జక్కన్న-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని తాజాగా మాకు అందిన సమాచారం ప్రకారం టీజర్ ను ఈనెల 29న విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

సినిమా ను మళ్లీ వాయిదా వేస్తారేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

వారి అనుమానాలు అన్ని కూడా పటా పంచలు చేసేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.సినిమా ను వాయిదా వేసే ఉద్దేశ్యం లేదని ఇతర సినిమా లకు మరింత స్పష్టమైన మెసేజ్ ను ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా ను ఖచ్చితంగా సంక్రాంతి ముందు వారంలోనే విడుదల చేయబోతున్నారు.అలాగే సినిమా టీజర్ ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.దీపావళికి ముందు ఆర్ ఆర్‌ ఆర్ టీజర్ వస్తుందని చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా మాకు విశ్వసనీయ సమాచారం అందింది.అది మరో మూడు రోజుల్లో వస్తుందని కూడా తెలుస్తోంది.

రాజమౌళి ఇప్పటికే ఇద్దరు హీరోలకు సంబంధించి విడి విడిగా టీజర్ ను విడుదల చేయడం జరిగింది.ఇప్పుడు ఇద్దరు హీరోలతో కలిపి ఒక టీజర్ ను విడుదల చేయనున్నాడు.

#Rajamouli #RRR #Ram Charan #RRR Teaser

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube