ఆర్‌ఆర్‌ఆర్‌ గురించి సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్న8 ప్రశ్నలకు సమాధానాలు ఇదుగో  

 • రాజమౌళి ఏ సినిమా చేసినా కూడా అది గొప్పగా, భారీగా, విభిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంవత్సరం క్రితం ఒక ఫొటోను సోషల్‌ మీడియాలో వదిలారు. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లతో రాజమౌళి ఉన్న ఫొటో విడుదల చేశారు. ఆ సమయంలో సినిమా గురించి ఎలాంటి క్లారిటీ లేదు. ఎవరు ఏమీ చెప్పలేదు. అప్పటి నుండి మొదలుకుని నిన్నటి వరకు అంటే సంవత్సరంకు పైగా ఆ సినిమా గురించి, పాత్రల గురించి, హీరోల గురించి, విలన్‌ గురించి, కథ గురించి, నేపథ్యం గురించి ఎన్నో ఎన్నో పుకార్లు, ప్రశ్నలు వచ్చాయి. ఆ ప్రశ్నలన్నింటికి దాదాపుగా చిత్ర యూనిట్‌ సభ్యులు సమాధానం చెప్పారు.

 • వాటిలో కీలకమైన ప్రశ్నలు ఇవే

 • 1. ఈ చిత్రం కథ నేపథ్యం ఏంటీ?
  స్వాతంత్య్రంకు పూర్వ కథ.

 • 2. హీరోల పాత్రలు ఏంటీ?
  ఈ చిత్రంలో చరణ్‌ అల్లూరి సీతరామరాజు పాత్ర, ఎన్టీఆర్‌ కొమురం భీం పాత్ర.

 • 3. హీరోయిన్స్‌ ఎవరు?
  బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్‌ (చరణ్‌), హాలీవుడ్‌ బ్యూటీ డైజీ అడ్గార్జియోన్స్‌

 • RRR Movie Team Superb Answers To Media Questions-Daisy Edgar-jones Media Questions Ntr Rajamouli Ram Charan Rrr

  RRR Movie Team Superb Answers To Media Questions

 • 4. టైటిల్‌ ఏంటీ?
  వర్కింగ్‌ టైటిల్‌ అయిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఫైనల్‌ టైటిల్‌

 • 5. ఈ చిత్రం బడ్జెట్‌ ఎంత?
  350 కోట్ల నుండి 400 కోట్లు

 • 6. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుంది?
  జులై 30, 2020

 • 7. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌ నటిస్తున్నాడా?
  అవును, ఈ చిత్రంలో అజయ్‌ దేవగన్‌ నటిస్తున్నాడు(విలన్‌గా అయితే కాదు)

 • 8. రెండు పార్ట్‌లుగా వస్తుందా?
  ఎట్టి పరిస్థితుల్లో ఇది రెండు పార్ట్‌లుగా తీయడం లేదు. ఈ కథ ఒక్క పార్ట్‌కు తగ్గట్లుగా ఉందని జక్కన్న క్లారిటీ ఇచ్చాడు.