బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఆలియా భట్ ఒకరు.ఈమె ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గా మారి పోయింది.
బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఈ బ్యూటీ బిజీగా ఉంది.కుర్ర హీరోల నుండి సీనియర్ హీరోల వరకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ అందరితో నటిస్తుంది.
తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఆలియా.ఈమె నటించిన బాలీవుడ్ సినిమాల్లో గంగూబాయి కతియావాడి ఒకటి.
ఇటీవలే ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ సాధించింది.ఈ సినిమాతో ఆలియా మరోసారి తన నటనలో విశ్వరూపాన్ని చూపించింది.
ఇక ఆలియా రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తుంది.ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా కనిపించనుంది.
ఈ సినిమాలో ఆలియా సీత పాత్రలో కనిపిస్తుంది.
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమాను టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కించాడు.ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నాడు.
ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 25న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించడంతో మళ్ళీ ఈ సినిమా కోసం ఎదురు చూడడం మొదలు పెట్టారు.

అయితే నిన్న బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ పుట్టిన రోజు జరుపుకున్న విషయం విదితమే.ఈ క్రమంలో ఈమె నటిస్తున్న బ్రహ్మాస్త్ర టీమ్ ఆలియాకు విషెష్ తెలిపారు కానీ ఆర్ ఆర్ ఆర్ టీమ్ మాత్రం సాయంత్రం వరకు విషెష్ చెప్పలేదు.ఈమె బర్త్ డే రోజు ఏదైనా స్పెషల్ గా రిలీజ్ చేస్తారేమో అని అంతా అనుకున్నారు.
కానీ వారికీ నిరాశే మిగిలింది.చిన్న ఫోటో పెట్టి బర్త్ డే విషెష్ తెలిపారు కానీ ఏది రివీల్ చెయ్యలేదు.
బ్రహ్మాస్త్ర రిలీజ్ చేసిన పోస్టర్ ని చూసిన రాజమౌళి ఆమెను ప్రశంసించగా ఆలియా కూడా కృతజ్ఞతలు తెలిపింది.

ఎప్పుడు ఎవరి పుట్టిన రోజుకైనా ముందే చెప్పే ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఈసారి మాత్రం లేట్ గా విషెష్ తెలిపింది.మరి ఆలియా పుట్టిన రోజును మాత్రం పట్టించుకోలేదు.ఇక ఇప్పుడు ప్రొమోషన్స్ లో కూడా ఆలియా పెద్దగా కనిపించడం లేదు.