ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదా ప్రకటన తర్వాత వైరల్‌ అవుతున్న ఒక పుకారు ఏంటంటే..!

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని ఈ ఏడాది జులై 30న విడుదల చేయాలని మొదట భావించారు.అదే విషయాన్ని ఒక భారీ ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేసి మరీ ప్రకటించారు.

 Rrr Movie Team Give The Clarity To Post Pone The Rrr Movie-TeluguStop.com

ఆ డేట్‌ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సమయంలో సినిమా వాయిదా అంటూ వార్తలు వచ్చాయి.చాలా మంది ఆ వార్తలు పట్టించుకోలేదు.

ఖచ్చితంగా జక్కన్న ఈసారి అనుకున్న సమయంకు వస్తాడని ఆయన అభిమానులు నమ్మకంగా ఎదురు చూశారు.

Telugu Bahubali, Rajamouli Rrr, Rrr Latest, Rrr Give, Rrrpone-Movie

వారి నమ్మకంపై నీళ్లు జల్లినట్లుగా నిన్న సినిమాను వచ్చే ఏడాది జనవరి 8న సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.ఈ చిత్రం విడుదల వాయిదా వెనుక కారణం ఏంటీ అంటే షూటింగ్‌ ఆలస్యంగా జరుగుతుంది.మంచి ఔట్‌ పుట్‌ రావాలి అంటే కాస్త ఆలస్యం చేయక తప్పడం లేదు అంటూ స్వయంగా యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.

అయితే యూనిట్‌ సభ్యులు ఇచ్చిన క్లారిటీని కాదని కొందరు కొత్త కొత్త పుకార్లను పుట్టించుకుంటున్నారు.

Telugu Bahubali, Rajamouli Rrr, Rrr Latest, Rrr Give, Rrrpone-Movie

అందులో ఒక పుకారు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.ఇంతకు ఆ పుకారు ఏంటీ అంటే బాహుబలి సినిమాను చాలా సార్లు వాయిదాల మీద వాయిదాలు వేసి చాలా ఆలస్యంగా విడుదల చేసిన విషయం తెల్సిందే.ఎంత ఎక్కువ వాయిదాలు పడితే బాహుబలికి అంతగా పబ్లిసిటీ దక్కడంతో పాటు క్రేజ్‌ పెరిగింది.

అందుకే ఆర్‌ఆర్‌ఆర్‌ విషయంలో కూడా అదే ఫార్ములాను వాడుతున్నారట.షూటింగ్‌ పూర్తి చేసి అనుకున్న తేదీకి విడుదల చేసే అవకాశం ఉన్నా కూడా కావాలని పబ్లిసిటీ కోసం క్రేజ్‌ పెంచేందుకు ఇలా వాయిదా వేశారంటూ పుకారు షికారు చేస్తుంది.

ఈ పుకారు నిజమేనా కాదే అనే విషయమై మీ స్పందన ఏంటీ

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube