ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ లో చరణ్ ను తారక్ డామినేట్ చేశారా.. ఏం జరిగిందంటే?

చరణ్, తారక్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఆర్ఆర్ఆర్ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఏకంగా మిలియన్ డాలర్ల కలెక్షన్లను సాధించింది.

 Rrr Movie Tarak Role Dominating Hero Charan Role Details Here ,rrr Movie,, Ntr,-TeluguStop.com

సినిమా రిలీజ్ కు మరో 18 రోజుల సమయంలో రిలీజ్ సమయానికి ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 4 మిలియన్ డాలర్ల కలెక్షన్లను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఫుల్ రన్ లో ఓవర్సీస్ లో ఈ సినిమా 10 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం ఉందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో చరణ్ ను తారక్ డామినేట్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.సాధారణంగా తారక్ నటనకు ఎవరూ వంకలు పెట్టలేరు.

తన నటనతో సాధారణ సినిమాను సైతం మరో స్థాయికి తీసుకెళ్లేంత టాలెంట్ తారక్ సొంతమనే సంగతి తెలిసిందే.

Telugu Rajamouli, Ram Charan, Rrr, Rrr Climax-Movie

అయితే చరణ్ తారక్ లలో ఎవరి పాత్ర డామినేటింగ్ గా ఉన్నా ఫ్యాన్స్ ఒప్పుకోరనే సంగతి తెలిసిందే.టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలుగా చరణ్, తారక్ సమాన స్థాయిలో ఉన్నారు.రాజమౌళి అలాంటి పొరపాట్లు అస్సలు చేయరని ఎన్టీఆర్ పాత్ర క్లైమాక్స్ లో హైలెట్ అయ్యేలా ఉంటే చరణ్ ఈ సినిమాలో నటించేవారు కాదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

సినిమా రిలీజయ్యే వరకు సినిమా గురించి ఇలాంటి గాసిప్స్ ఎన్నో ప్రచారంలోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

ఆర్ఆర్ఆర్ సినిమా మాత్రం ఇద్దరు హీరోల అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా ఉండనుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

రాజమౌళి తన ప్రతి సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించారు.ఆర్ఆర్ఆర్ తో బాక్సాఫీస్ వద్ద దర్శకధీరుడు ఎన్ని అద్భుతాలు చేస్తారో చూడాల్సి ఉంది.చరణ్, తారక్ లకు ఈ సినిమా సక్సెస్ కీలకమనే సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube