ఇలా మొదలెట్టారు అలా బ్రేక్ ఇచ్చేశారు!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు దర్శకధీరుడు రాజమౌళి రెడీ అవుతున్నాడు.

 Rrr Movie Takes Break After Resuming Shooting, Rrr, Ntr, Rajamouli, Ram Charan,-TeluguStop.com

అయితే ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

కాగా ఇటీవల సినిమా షూటింగ్‌లు తిరిగి ప్రారంభం కావడంతో ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్‌ను కూడా జక్కన్న అండ్ టీమ్ ఇటీవల ప్రారంభించారు.దీంతో ఈ సినిమా షూటింగ్ నిర్విరామంగా సాగుతుందని అందరూ అనుకున్నారు.

అయితే అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చేశారు చిత్ర యూనిట్.తారక్, రామ్ చరణ్‌లు కలిసి ఈ షూటింగ్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే.

అయితే ఈ షూటింగ్‌లో కేవలం తారక్‌కు సంబంధించిన టీజర్ కోసం చిత్రీకరణ జరిపినట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.

పీరియాడిక్ ఫిక్షన్ సినిమాగా రాజమౌళి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమాలోని రామరాజు టీజర్‌కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, ఒలివియా మారిస్‌లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

కాగా ఈ సినిమాలోని ఎన్టీఆర్ టీజర్‌ను అక్టోబర్ 22న రిలీజ్ చేస్తున్నట్లు జక్కన్న అండ్ టీమ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube