'ఆర్ఆర్‌ఆర్‌' షూటింగ్‌ కు ఏర్పాట్లు షురూ చేసిన జక్కన్న

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చిన సమయంలో కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా షూటింగ్‌ నిలిచి పోయిన విషయం తెల్సిందే.పెద్ద ఎత్తున సినిమా పై అంచనాలు ఉన్నాయి.

 Rrr Movie Shooting Update By Director Rajamouli , Film News, Rajamouli, Ram Char-TeluguStop.com

వెయ్యి కోట్ల వరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుంది.ఇంతటి క్రేజ్‌ ఉన్న ఈ సినిమా చిత్రీకరణ నిలిచి పోవడంతో విడుదల కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ సినిమా ను అనుకున్న తేదీకి విడుదల చేయడం దాదాపుగా అసాధ్యం అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా అనుకున్నారు.జులై లో ఈ సినిమా ను విడుదల చేయలేకున్నా కనీసం దసరా లేదా వచ్చే సంక్రాంతికి అయినా సినిమా ను విడుదల చేయడం తో పాటు హీరోలు ఇద్దరు వేరే సినిమా లను కమిట్ అవ్వడం కోసం గాను షూటింగ్‌ కు గుమ్మడి కాయ త్వరగా కొట్టేయాలనే నిర్ణయానికి వచ్చారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా చిత్రీకరణ కోసం మరో రెండు నెలల వర్కింగ్‌ డేస్‌ అవసరం ఉందట.అందుకే ఈనెల చివర్లో సినిమా ను ప్రారంభించి ఆగస్టు వరకు పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు.

వరుసగా సినిమా లకు సంబంధించిన షూటింగ్‌ మరియు ఇతరత్ర కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

Telugu Rajamouli, June, Netflix, Ott Satellite, Postpone, Ram Charan Ntr, Rrr-Mo

ప్రస్తుతం సినిమాకు చెందిన డబ్బింగ్‌ వర్క్‌ తో పాటు ఇతర పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ను కూడా నిర్వహిస్తున్నారు.షూటింగ్‌ ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో సినిమా బిజినెస్‌ ను కూడా దాదాపుగా క్లోజ్‌ చేశారు.ఇటీవలే ఓటీటీ మరియు శాటిలైట్ రైట్స్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.

ఈ సినిమా ను రెండు ఓటీటీ లకు ఇవ్వడం రికార్డుగా చెబుతున్నారు.పలు విదేశీ భాషల్లో ఈ సినిమా ను నెట్‌ ఫ్లిక్స్ ద్వారా చూసే వీలు ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

మొత్తానికి జూన్ లో షూటింగ్‌ ను ప్రారంభించి వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను విడుదల చేస్తారేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube