ఆర్‌ఆర్‌ఆర్‌ వీడియో : రాయల్‌ ఎన్ఫీల్డ్‌ తో కొత్త ఆలోచనలు

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఎట్టకేలకు ఆర్‌ఆర్ఆర్ సినిమా షూటింగ్‌ పునఃప్రారంభించాడు.దేశ వ్యాప్తంగా ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురు చూశారు.

 Rrr Movie Shooting Started Rrr, Rajamouli, Ramcharan, Ajay Devagan, Ntr, Hyderab-TeluguStop.com

నిన్నటి నుంచి షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాలో ఈ ఏడాది చివరి వరకు కంటిన్యూస్ గా చిత్రీకరించి వచ్చే ఏడాది సమ్మర్ వరకు పూర్తి చేసి వచ్చే ఏడాది దసరా సీజన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు.ఈ సినిమాలో మొదటి నుంచి చెబుతున్నట్లుగా రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగించే లా కొత్త ఆలోచనలు రేకెత్తించే లా తాజా వీడియో ఉంది.ఎన్టీఆర్ మరియు రాం చరణ్ ఇద్దరు వీడియో చివర్లో ఒకరు గుర్రం పై మరొకరు రాయల్ ఎన్ఫీల్డ్ బండి పై వస్తున్నారు.

అప్పట్లో అంటే స్వాతంత్ర్యం రాక ముందు రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లు ఉండేవేమో కానీ ప్రస్తుతం ఉన్నట్లుగా లేవు.అందువల్ల ఈ కథలో ఏదో కొత్తదనం ఉంటుందని రెండు జనరేషన్ లకు సంబంధించి ఉంటుందేమో అంటూ ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

మొత్తానికి నిన్న విడుదలైన వీడియో తో సినిమాపై అంచనాలు మరింతగా పెంచేసారు.భారీ ఎత్తున షూటింగు నిర్వహిస్తున్న జక్కన్న సినిమాలో అన్ని కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాదు అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.అక్కడ వేసిన భారీ సెట్ లో ఈ సినిమా చిత్రీకరణ చేస్తున్నారు.

రాజమౌళి దర్శకత్వం అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉంటాయి.ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ మరియు స్టార్ హీరోయిన్ ఆలియా భట్ లో ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుంది.ఈ నేపథ్యంలో హిందీలో కూడా ఈ సినిమా దుమ్ము రేపడం ఖాయం అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube