టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మెజారిటీ శాతం పూర్తయినా, ఇంకా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే సందేహం అందరిలోనూ నెలకొంది.
కాగా ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
అయితే ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.
కాగా కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్‌ను ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే.తాజాగా ఈ చిత్ర షూటింగ్‌ను మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ప్రాంతంలో జరుపుతున్నారు.
ఇప్పటికే వారి పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్లు రిలీజ్ కాగా వాటికి స్టన్నింగ్ రెస్పాన్స్ లభించింది.కాగా తాజాగా ఈ చిత్ర షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియోను చిత్ర నిర్మాత డివివి దానయ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఈ వీడియోను ఆర్ఆర్ఆర్ అభిమానులు విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో తారక్ సరసన ఒలివియా మారిస్‌తో పాటు చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్గా నటిస్తోంది.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది.
ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఆర్ఆర్ఆర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఏదేమైనా ఆర్ఆర్ఆర్ చిత్రం సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.