'ఆర్ఆర్‌ఆర్‌' మూవీ ఉక్రెయిన్‌ షెడ్యూల్‌ అప్‌డేట్‌

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఉక్రెయిన్ లో జరుగుతున్న విషయం తెల్సిందే.సినిమా షూటింగ్‌ ను ముగించడం కోసం జక్కన్న టీమ్‌ అక్కడకు వెళ్లారు.

 Rrr Movie Shooting In Ukraine Update-TeluguStop.com

ఇటీవలే అక్కడ ల్యాండ్‌ అయిన చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రస్తుతం కీలక సాంగ్ చిత్రీకరణ లో బిజీగా ఉన్నారు.కేవలం సాంగ్‌ మాత్రమే కాకుండా సినిమాకు సంబంధించిన రెండు కీలక సన్నివేశాలను కూడా అక్కడ ప్లాన్‌ చేశారనే టాక్ వినిపస్తుంది.

ఆ విషయమై ఎలాంటి స్పష్టమైన అధికారిక క్లారిటీ లేదు.కాని విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఉక్రెయిన్ షెడ్యూల్‌ కేవలం పది రోజులు మాత్రమేనట.

 Rrr Movie Shooting In Ukraine Update-ఆర్ఆర్‌ఆర్‌’ మూవీ ఉక్రెయిన్‌ షెడ్యూల్‌ అప్‌డేట్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంటే త్వరలోనే యూనిట్‌ సభ్యులు ఇండియాకు రాబోతున్నారు.

ఉక్రెయిన్ షెడ్యూల్‌ ను ముగించిన తర్వాత ఒక రోజు హైదరాబాద్‌ లో చిత్రీకరణ ఉంటుంది.

ఇద్దరు హీరోలపై ఉండే ఆ సన్నివేశం చిత్రీకరణతో సినిమా పూర్తి అవుతుందట.అదే రోజు గ్రాండ్ గా గుమ్మడి కాయ కొట్టే స్తారు.మొత్తంగా సినిమాను ఈ నెలలోనే పూర్తి చేస్తారని తెలుస్తోంది.సినిమాకు సంబంధించిన 85 శాతం వీఎఫ్‌ ఎక్స్ వర్క్‌ ముగిసింది.

రెండు నెలలకు పైగా సమయం ఉంది.ఈ సమయంలో మిగిలిన బ్యాలన్స్‌ వర్క్ ను ముగిస్తారని తెలుస్తోంది.

మొత్తానికి ఉక్రెయిన్ వచ్చిన వెంటనే చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రమోషన్స్‌ సందడి మొదలు పెట్టబోతున్నారు.రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న ఈ సినిమా లో బాలీవుడ్‌ స్టార్‌ ఆలియా భట్‌ నటిస్తుంది.

Telugu Film News, Movie News, News In Telugu, Ntr, Rajamouli, Ram Charan, Rrr-Movie

రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను ఈ సినిమా రాబడుతుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ లో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ను ఇండియాలోనే కాకుండా 15 నుండి 20 దేశాల్లో కూడా విడుదల చేయబోతున్నారు.ఇండియన్ లాంగ్వేజెస్ లో కాకుండానే ఇతర దేశ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు.

#Ram Charan #Rajamouli

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు