ఆర్ఆర్ఆర్ షూటింగ్ వాయిదాకి కారణం అయిన రామ్ చరణ్  

రామ్ చరణ్ గాయం కారణంగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ కి వాయిదా వేసిన జక్కన్న. .

Rrr Movie Shooting Go Back To 3 Weeks-ntr,rajamouli,ram Charan,rrr Movie Shooting,tarak,tollywood

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా భారీ బడ్జెట్ తో రాజమౌళి తెరకెక్కుస్తున్న చిత్ర ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూనేలో జరగాల్సి ఉంది. దర్శకుడు రాజమౌళి దీనికి అంతా ప్లానింగ్ కూడా చేసుకున్నాడు..

ఆర్ఆర్ఆర్ షూటింగ్ వాయిదాకి కారణం అయిన రామ్ చరణ్-RRR Movie Shooting Go Back To 3 Weeks

ఇక హీరోలిద్దరూ షూటింగ్ కోసం వదోదర కూడా వెళ్ళారు. అక్కడ షూటింగ్ చేస్తుండగా అర్ధంతరంగా మళ్ళీ వాయిదా వేసేసారు. దీనికి ప్రధాన కారణం రామ్ చరణ్ అని తెలుస్తుంది.

మంగళవారం జిమ్రా లో వర్క్ అవుట్ చేస్తున్న టైంలో రామ్ చరణ్ గాయపడటం దర్శకుడు రాజమౌళి సినిమా షూటింగ్ వాయిదా వేసారు. జిమ్‌లో కసరత్తులు చేస్తున్న సమయంలో రామ్‌చరణ్‌ గాయపడ్డారని తెలియజేయడానికి బాధపడుతున్నాం. ప్రస్తుతానికి ఫుణె షెడ్యూల్‌ లేదు.

మూడు వారాల తర్వాత యాక్షన్‌ తిరిగి ప్రారంభం అవుతుంది అని చిత్రబృందం ట్విట్టర్ లో ప్రకటించింది.

ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ వాయిదా పడటంతో రామ్ చరణ్, తారక్ మళ్ళీ హైదరాబాద్ వచ్చేసినట్లు తెలుస్తుంది. ఇక ప్రతిష్టాత్మకంగా హాలీవుడ్ స్టాండర్డ్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హాలీవుడ్ హీరోయిన్ తో పాటు, అలియా భట్, అజయ్ దేవగన్, సముద్రకని లాంటి స్టార్ నటులు నటిస్తున్నారు. ఇక వచ్చే ఏడాదికి సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని జక్కన్న టార్గెట్ తో ఉండగా ఊహించని విధంగా జరిగిన ప్రమాదం సినిమా వాయిదాకి కారణం అయ్యింది.