ఆర్‌ఆర్‌ఆర్‌ అప్‌డేట్‌.. ఫైట్స్ గురించి ఇంట్రెస్టింగ్‌ గాసిప్స్‌

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది.ప్రస్తుతం ఉక్రెయిన్‌ లో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను అక్టోబర్‌ లో విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.

 Rrr Movie Shooting And Actions Scenes , Flim News, Ntr, Rajamouli, Ram Charan, R-TeluguStop.com

భారీ ఎత్తున యాక్షన్‌ సన్నివేశాలతో పాటు ఈ సినిమాలో ఎమోషనల్‌ సన్నివేశాలు చాలా ఉంటాయంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఏకంగా పది యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయట.

ఆ యాక్షన్‌ సన్నివేశాలు సినిమా స్థాయిని అమాంతం పెంచే విధంగా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పాటలు చిత్రీకరిస్తున్నారు.

Telugu Rajamouli, Ram Charan-Movie

చాలా రోజులుగా ఈ సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాల గురించి వార్తలు వస్తున్నాయి.ముఖ్యంగా యాక్షన్‌ సన్నివేశాలు కొన్ని కంట తడి పెట్టిస్తాయని విజయేంద్ర ప్రసాద్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.ఇద్దరు హీరోల మద్య కూడా యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయి.కనుక సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడే అంతా కూడా అవాక్కయ్యేలా దర్శకుడు షూట్‌ చేశాడట.అద్బుతమైన సినిమాను దర్శకుడు జక్కన్న అంతకు మించిన కాన్సెప్ట్‌ తో రూపొందిస్తున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.రికార్డ్‌ బ్రేకింగ్‌ వసూళ్లను ఈ సినిమా దక్కించుకోవడం ఖాయం అంటూ ఇప్పటికే అభిమానులు చాలా ధీమాతో ఉన్నారు.

ఇద్దరు యంగ్‌ స్టార్‌ హీరోలు ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌ లను ఈ సినిమాలో జక్కన్న చూపించిన విధానం అద్బుతం అన్నట్లుగా కామెంట్స్‌ వస్తున్నాయి.అక్టోబర్‌ లో విడుదల కాబోతున్న ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమకు ఏకంగా ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చి పెడుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

 బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ ఆలియా భట్‌ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు.అక్షయ్‌ కుమార్‌ కూడా కీలక పాత్రలో ఈ సినిమాలో నటించిన విషయం తెల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube