ఆర్ఆర్ఆర్ కి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌.. కాని చిన్న మెలిక!

రాజమౌళి దర్శకత్వం లో టాలీవుడ్ బిగ్గెస్ట్ హీరో లు అయిన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు కలిసి నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.మార్చి 25 తారీ ఖున భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తం గా ఈ సినిమాను విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.

 Rrr Movie Release Update In Telangana Details, Ram Charan, Ntr, Rrr, Rajamouli,-TeluguStop.com

అమెరికా తో పాటు పలు ప్రపంచ దేశాల్లో ఈ సినిమా రికార్డు స్థాయి లో విడుదల చేయబోతున్న సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు ప్రభుత్వాల నుండి ఇటీవలే అను మతులు కోరడం జరిగింది.ఈ సినిమా అదనపు షో మరియు టికెట్ల రేట్ల పెంపుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తాజాగా ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమాకు ప్రత్యేకంగా అనుమతులను మంజూరు చేయడంతో ఖచ్చితంగా నైజాం ఏరియాలో భారీ వసూళ్లను ఈ సినిమా దక్కించు కుంటుంది అంటూ ప్రతి ఒక్కరు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.అయితే సినిమా ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంట వరకు అంటే తెల్లవారు జాము షో లు లేకుండా ఉదయం నుండి రాత్రి వరకు మాత్రమే ఐదు ప్లాన్ చేసుకోవాలి.

అంతే కానీ బెనిఫిట్‌ షో లు వేయడానికి అవకాశం లేదంటూ మెలిక పెట్టింది.సినిమా విడుదలైన మొదటి రోజు కూడా బెనిఫిట్ షో వేసేందుకు అనుమతి లేదంటూ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా తేల్చి చెప్పారు.

Telugu Ajay Devgan, Alia Bhatt, Pan India, Rajamouli, Ram Charan, Shriya Sharan,

కనుక ప్రభుత్వ అనుమతులు తగ్గట్లుగానే డిస్ట్రి బ్యూటర్లు మరియు బయర్లు సినిమా ని మార్నింగ్ 7 ప్రారంభించాలని నిర్ణయించారు.బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్ మరియు అజయ్ దేవగన్ లు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.ఈ సినిమా లో సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్ కూడా కనిపించ బోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్దం అవ్వడంతో ప్రతి ఒక్క అభిమాని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఖచ్చితంగా సినిమా భారీ వసూళ్లు నమోదు చేస్తుంది అంటూ ప్రతి ఒక్కరు కూడా నమ్మకంతో ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube