మళ్ళీ ఆర్.ఆర్.ఆర్ విడుదల వాయిదా.... ఎప్పుడంటే...?

ప్రముఖ దర్శకుడు జక్కన్న ఎస్.ఎస్ రాజమౌళి ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్నటువంటి చిత్రం ఆర్.

 Rrr Movie Release Postponed On 2021 Jan 8th-TeluguStop.com

ఆర్ ఆర్.ఈ చిత్రం స్వాతంత్రం కోసం పోరాడిన  అల్లూరి సీతారామరాజు మరియు కొమరం భీమ్ వీరుల విజయ గాథల ఆధారంగా తెరకెక్కుతోంది.అయితే ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.అంతేగాక ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవగన్, అందాల తార శ్రీయ, నటి అలియా భట్, కిచ్చ సుదీప్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

అయితే ఈ చిత్రం ఈ వేసవి కానుకగా మే నెలలో విడుదల కాబోతోందని ఇప్పటికే దర్శకుడు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.దీంతో ఇటు మెగా అభిమానులు అటు నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

 అయితే తాజాగా ఈ విడుదల తేదీని 2021వ సంవత్సరం జనవరి 8వ తేదీకి వాయిదా వేశారు.దీంతో ఈ స్టార్ హీరోల అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

అంతేకాక దర్శకుడు రాజమౌళి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ విడుదల సమాచారాన్ని చిత్ర యూనిట్ సభ్యులు ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు.

Telugu Jr Ntr, Ram Charan Tej, Rrr Latest, Rrr, Rrr Jan, Ss Rajamouli, Tollywood

అయితే ఇది ఇలా ఉండగా ఈ చిత్ర యూనిట్ సభ్యులు “ప్రేక్షకులకి మంచి సినిమాని అందించాలని రోజులో దాదాపు అన్నిగంటలు పని చేస్తూ శ్రమిస్తున్నారని, కానీ చేయాల్సిన పని ఇంకా చాలా ఉందని అందువల్లనే ఈ చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.అయితే ఇప్పటికే దర్శకుడు జక్కన్న పలు సందర్భాల్లో చిత్రంలోని పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించిన కూడా పూర్తి చేశామని చెప్పిన సంగతి తెలిసిందే.అయితే మరి వచ్చే సంవత్సరం జనవరిలో ఆయన అనుకున్న తేదీకి ఆర్.ఆర్.ఆర్ విడుదల చేస్తారో లేదో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube