ఆర్ఆర్‌ఆర్‌: రిలీజ్ డేట్‌ కన్ఫర్మ్‌ చేయబోవడం లేదట

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌ లు హీరోలుగా భారీ మల్టీ స్టారర్ ను రూపొందిస్తున్నారు.అతి భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్నాయి.

 Rrr Movie Release Date Not Confirmed Yet , Rrr Movie, Rrr Movie Release Date, Ra-TeluguStop.com

సినిమా షూటింగ్ ఆలస్యం అవుతున్న కారణంగా గత ఏడాది నుండి వచ్చే ఏడాది వరకు వాయిదాలు పడుతూనే ఉన్నాయి.ఈ సినిమా ను జులై లో విడుదల చేయాలనుకుంటే సెకండ్‌ వేవ్‌ మొత్తం ప్లాన్‌ ను తలకిందులు చేసింది.

దాంతో ఆర్‌ ఆర్‌ ఆర్‌ రిలీజ్ డేట్‌ ను మార్చేసినట్లుగా సమాచారం అందుతోంది.ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్బంగా ఈనెల 20వ తారీకున కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారని అంటున్నారు.

కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వబోవడం లేదు.

కరోనా థర్డ్‌ వేవ్ అని కూడా అంటున్నారు.

కనుక విడుదల తేదీ ని ఇప్పుడే ప్రకటించే అవకాశం కనిపించడం లేదు.సినిమా ను పూర్తి చేసి ఆ తర్వాత విడుదల తేదీ విషయంలో నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు.

కొందరు ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేద్దాం అంటే మరి కొందరు వచ్చే ఏడాది సమ్మర్‌ లో సినిమాను విడుదల చేయాలని అంటున్నారు.కాని ఇప్పటి వరకు సినిమా షూటింగ్‌ పూర్తి కాలేదు కనుక విడుదల తేదీ విషయంపై ఎటూ తేల్చుకోలేని పరిస్థితి కనిపిస్తుంది.

అందుకే ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదల తేదీ విషయాన్ని ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్బంగా అనౌన్స్‌ చేయక పోవచ్చు అంటున్నారు.దసరా సందర్బంగా విడుదల తేదీ ని అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ ను విడుదల చేయాలని కొత్త ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.

నాలుగు సంవత్సరాలుగా ఆర్‌ ఆర్‌ ఆర్‌ గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube