ఆర్‌ఆర్‌ఆర్‌ : ప్రమోషన్‌ షురూ అంటే అక్టోబర్‌ లో ఆఘమనం ఖాయమా?

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ఆర్ ఆర్‌ ఆర్‌ ను మొదలు పెట్టి దాదాపుగా నాలుగు సంవత్సరాలు అవుతుంది.అయినా ఇప్పటి వరకు విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు.

 Rrr Movie Release Date News Update, Film News, Ntr, Rajamouli, Ram Charan, Rrr,-TeluguStop.com

గత ఏడాది కాలంగా కరోనా వల్ల ఆలస్యం అవుతున్న ఈ సినిమా ను అక్టోబర్ లో విడుదల చేసే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.అయితే ఇప్పటి వరకు చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి మాత్రం ఎలాంటి అప్‌ డేట్‌ లేదు.

ఇక ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా షూటింగ్‌ నిమిత్తం ఇటీవలే చివరి షెడ్యూల్‌ ను మొదలు పెట్టారు.సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో సినిమా ప్రమోషనల్‌ వీడియోలను మరియు వరుసగా పోస్టర్‌ లను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.

సినిమాను పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు ముందు నుండే ప్రమోషన్‌ అవసరమే.కాని తేదీ ప్రకటించకుండా ప్రమోషన్‌ మొదలు పెట్టారు అంటే చాలా త్వరలోనే సినిమా ఉంటుందని కొందరు విశ్లేషిస్తున్నారు.

అదే కనుక నిజం అయితే ఖచ్చితంగా అక్టోబర్‌ లో ఈ సినిమా విడుదల ఉంటుందనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.పెద్ద ఎత్తున అంచనాలున్న ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా ను అక్టోబర్‌ లో విడుదలకు సిద్దం చేయాలనే ఉద్దేశ్యంతో హడావుడిగా ఈ నెలలోనే షూటింగ్‌ కు గుమ్మడి కాయ కొట్టాలని జక్కన్న భావిస్తున్నాడు.

Telugu Alia Bhatt, Dvv Danayya, Rajamouli, Ram Charan, Rrr Schedule, Rrr, Tollyw

అందులో భాగంగానే యూనిట్‌ సభ్యులందరిని కూడా చివరి షెడ్యూల్‌ కు పిలిచారు.ప్యాచ్‌ వర్క్‌ ఏమైనా ఉంటే షూటింగ్‌ ను ముగించ బోతున్నారు.ఈ నెల చివరి వరకు షూటింగ్‌ పూర్తి చేయడం తో పాటు ప్రమోషనల్‌ వీడియో లను కూడా విడుదల చేసేందుకు సిద్దం అవుతున్న నేపథ్యంలో సినిమా అక్టోబర్‌ లో ఖాయం అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube