ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ అప్పుడే.. లీక్ చేసిన నటి..?

2021 సంవత్సరంలో విడుదల కాబోయే సినిమాల్లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్.టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు.

 Star Director Rajamouli Rrr Movie Release Date Fixed-ramcharan-jr Ntr-alluri Sit-TeluguStop.com

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ అభిమానులతో పాటు సాధారణ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే రాజమౌళి రెండుసార్లు ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించి కొన్ని కారణాల వల్ల చెప్పిన డేట్ కు సినిమాను విడుదల చేయలేకపోయారు.

అందువల్లే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తైనా మూడోసారి రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు.ఈ నెల 26వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి మరో టీజర్ విడుదల కానున్నట్టు ప్రచారం జరుగుతుండగా ఆ టీజర్ లో రిలీజ్ డేట్ ప్రకటించవచ్చని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

అయితే ఈ సినిమాలో నటిస్తున్న నటి పొరపాటున ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ను లీక్ చేసేసింది.ఐరిష్ నటి అలిసన్ డూడీ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అక్టోబర్ 8వ తేదీ 2021 సంవత్సరం ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించారట.అయితే ఆ తరువాత చేసిన తప్పును గ్రహించిన ఆ నటి వెంటనే పోస్ట్ ను డిలీట్ చేశారట.ఈ మేరకు సోషల్ మీడియాలో అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

దసరా పండుగకు ఆర్ఆర్ఆర్ విడుదలవుతుందని ప్రచారం జరగగా ఆ ప్రచారం నిజమవుతూ ఉండటం గమనార్హం.

ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు.

ఫిక్షనల్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది.నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమా కోసం 400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube