రిలీజ్‌ డేట్‌ ఫిక్స్: దసరా బొనంజాగా `ఆర్‌ ఆర్‌ ఆర్‌`

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకున్న సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సంగతి అందరికి విదితమే.ఈ సినిమాను డి.వి.వి.దానయ్య నిర్మాణ పనులు చేపడుతున్నారు.ఎన్టీఆర్, రామ్ చరణ్ సరసన ఆలియాభట్,  బ్రిటీష్ నటి ఒలీవియా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.అంతేకాకుండా ఈ సినిమాలో అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియ కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు.

 Rajamouli Rrr Movie Release Date Confirmed, Rrr, Ram Charan, Ntr, Rrr Movie Rele-TeluguStop.com

ఈ సినిమాపై ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను తెలియజేసింది సినిమా యూనిట్.

సోషల్ మీడియా వేదికగా దసరా పండుగా కానుకగా అక్టోబర్ 13న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా తెలియజేసింది.సోషల్ మీడియా ద్వారా “అక్టోబర్ 13న ఫైర్, వాటర్ కలిసి ఫోర్స్ గా వచ్చేటందుకు సాక్ష్యం, భారతీయ సినిమాల లోనే అతిపెద్ద కొలాబరేషన్‌ సెట్‌ అయి చిరస్మరణీయమైన అనుభవాన్ని…ప్రేక్షకులకు అందించడానికి సిద్ధంగా ఉంది.

ది రైడ్ ప్రారంభమయింది “అంటూ చిత్రయూనిట్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.

అలాగే మరోవైపు ఈ సినిమాలో నటిస్తున్న నటి ఐరిష్ సినిమా విడుదల తేది అక్టోబర్ 8 అని తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేసింది.ఆమె వెంటనే ఆ తప్పును తెలుసుకొని ఆ పోస్ట్ ను డిలీట్ చేసింది.కానీ అప్పటికే అది ప్రేక్షకుల లోకి వెళ్లి పోయేసరికి చిత్ర బృందానికి ఏం చేయాలో అర్థం కాలేదు.

కానీ చివరికి రాజమౌళి ఎట్టకేలకు విడుదల తేదీని ప్రకటించారు.దీంతో అభిమానులలో ఆశక్తిని కలిగిస్తుంది.తాజాగా రిలీజ్ డేట్ కానుకగా ఒక పోస్టర్ కూడా విడుదల చేసింది.ఈ పోస్టర్ ఆధారంగా గుర్రం పై రామ్ చరణ్, బుల్లెట్ పై ఎన్టీఆర్ ఆవేశంతో వెళ్తున్నట్టుగా ఉంది.

ఇటీవల కాలంలోనే క్లైమాక్స్ షూటింగ్ ను కూడా ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్న అనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమా భాషలలో విడుదల చేసేందుకు రాజమౌళి టీం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube