కరోనా థర్డ్‌ వేవ్‌ కు ఆర్‌ఆర్‌ఆర్ రిలీజ్ కు లింక్‌

కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఆర్‌ ఆర్‌ ఆర్ రిలీజ్‌ డేట్ మరోసారి వాయిదా పడింది.ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చిన సమయంలో సెకండ్‌ వేవ్‌ రూపంలో అవాంతరం ఎదురు అయ్యింది.

 Rrr Movie Release Date Confirm-TeluguStop.com

కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్‌ సినిమా ను వచ్చే ఏడాది జనవరి 26న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించబోతున్నారు.సినిమా థియేటర్లు అప్పటికి పూర్తి స్థాయిలో రన్ అవుతాయనే నమ్మకంతో ఆర్ ఆర్‌ ఆర్‌ మేకర్స్ ఆ నిర్ణయానికి వచ్చారు.

ఒక వేళ కరోనా థర్డ్‌ వేవ్‌ అంటూ థియేటర్లు మళ్లీ సక్రమంగా రన్ అవ్వకున్నా లేదంటే మరేదైన కారణం వల్ల విడుదల చేయలేని పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా రాధే సినిమా తరహాలో సినిమా ను ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

 Rrr Movie Release Date Confirm-కరోనా థర్డ్‌ వేవ్‌ కు ఆర్‌ఆర్‌ఆర్ రిలీజ్ కు లింక్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆర్‌ ఆర్‌ ఆర్ సినిమా ను థియేటర్లలో వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయలని పరిస్థితే కనుక వస్తే ఖచ్చితంగా పే పర్‌ వ్యూ పద్దతిన సినిమా ను విడుదల చేయాలని భావిస్తున్నారు.

పే పర్ వ్యూ పద్దతిన సినిమా కు మరింతగా వసూళ్లు వస్తాయని ఆశిస్తున్నారు.కాని మేకర్స్ మాత్రం థియేటర్ల ద్వారానే ఈ సినిమా ను విడుదల చేస్తే బాగుంటుందనే అభిప్రాయం తో ఉన్నారు.

కనుక కరోనా థర్డ్‌ వేవ్‌ రావద్దనే అంతా కోరుకుంటున్నారు.

Telugu Corona, Corona Third Wave, Crores Of Loss, Dvv Danayya, Film News, Radhe Movie, Rajamouli, Rrr, Rrr As Pay Per View, Rrr In Ott, Rrr Movie Update, Rrr Release Date-Movie

ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా షూటింగ్‌ ను ఆగస్టుకు ముగించే పనిలో జక్కన్న ఉన్నాడు.రాజమౌళి సూచన మేరకు హీరోలు ఇద్దరు మరియు హీరోయిన్‌ అంతా కూడా షూటింగ్ కు సిద్దం అయ్యారు.రికార్డు స్థాయి బడ్జెట్‌ తో ఈ సినిమా ను దానయ్య నిర్మిస్తున్నాడు.

ఇప్పటికే సినిమా ఆలస్యం అవ్వడం వల్ల వంద కోట్ల అదనపు బారం పడుతుందని అంటున్నారు.జనవరి కంటే ఎక్కువ వెయిట్‌ చేస్తే మాత్రం వంద కోట్లను మించి నష్టం ఉంటుంది.

కనుక ఎట్టి పరిస్థితుల్లో ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా ను జనవరి లో థియేటర్ల ద్వారా లేదంటే పే పర్ వ్యూ పద్దతి ద్వారా విడుదల చేసే అవకాశం.

#DVV Danayya #RrrAs #Crores Of Loss #Rrr In Ott #Corona

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు