అల్లూరి, భీమ్ రూపంలో విగ్రహాలు.. ఆర్ఆర్ఆర్ క్రేజ్ మామూలుగా లేదుగా?

ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్లలో విడుదలై నాలుగు నెలలైనా సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఈ సినిమా గురించి ఇప్పటికీ చర్చ జరుగుతోంది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందనే సంగతి తెలిసిందే.

 Rrr Movie Ram Bheem Ganesh Idols,ram,rrr Movie Ram Bheem Ganesh Idols ,rrr,vinay-TeluguStop.com

ఈ సినిమాకు రాబోయే రోజుల్లో సైతం ఊహించని స్థాయిలో అవార్డులు రావడం గ్యారంటీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే రేపు వినాయకచవితి పండుగ అనే సంగతి తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగలలో ఈ పండుగ కూడా ఒకటి.అయితే ఈ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అల్లూరి సీతారామరాజు రూపంలో గణేష్ విగ్రహాలు దర్శనమిస్తున్నాయి.

ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ అల్లూరి గెటప్ లో కొంత సమయం పాటు కనిపించిన సంగతి తెలిసిందే.

చరణ్ అల్లూరి వేషధారణను స్పూర్తిగా తీసుకుని గణేష్ విగ్రహాలను తయారు చేయడం గమనార్హం.

మరికొన్ని ప్రాంతాల్లో భీమ్ రూపంలో వినాయక విగ్రహాలు దర్శనమిస్తున్నాయి.అటు చరణ్ ఇటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ విగ్రహాల ద్వారా తమ ఫేవరెట్ హీరోలపై అభిమానాన్ని చాటుకోవడంతో వినాయకునిపై భక్తిని చాటుకుంటున్నారు.

ఈ విగ్రహాలను చూసి సాధారణ ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Telugu Bheem, Ganesh Idols, Jr Ntr, Ram Charan, Rrrram-Movie

ఆర్ఆర్ఆర్ ఓటీటీలో, బుల్లితెరపై కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.ఇతర భాషలలో సైతం ఈ సినిమాకు కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.ఈ సినిమా సక్సెస్ వల్ల అటు చరణ్ ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ ఊహించని స్థాయిలో పెరిగింది.

ఆర్ఆర్ఆర్ మూవీ ఫుల్ రన్ లో 1100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.ఈ సినిమా సక్సెస్ సాధించడంతో పాటు చరణ్, తారక్ క్రేజ్ ను ఊహించని స్థాయిలో పెంచిందనే సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube