ఆర్ఆర్ఆర్ కోసం అలియా భట్ కి అంత ఇచ్చారా  

ఆర్ఆర్ఆర్ కోసం అలియా భట్ కి భారీ మొత్తంలో ముట్టజెబుతున్న నిర్మాత..

Rrr Movie Producer Gives Huge Remuneration For Alia Bhatt-

బాలీవుడ్ యంగ్ ముద్దుగుమ్మ అలియా భట్ ప్రస్తుతం అక్కడ మోస్ట్ క్రేజీ హీరోయిన్ అని చెప్పాలి.ఓ వైపు నటిగా నిరూపించుకునే సినిమాలు చేస్తూ, మరో వైపు భారీ ప్రాజెక్ట్ లలో కూడా ఈ భామ భాగం అవుతుంది.

Rrr Movie Producer Gives Huge Remuneration For Alia Bhatt--RRR Movie Producer Gives Huge Remuneration For Alia Bhatt-

ఇక అలియా ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలు అన్ని కూడా హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి.దీంతో రాజమౌళి కూడా అలియా భట్ పైనే ద్రుష్టి పెట్టి ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ కి జోడీగా ఈ భామని రంగంలోకి దించాడు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా కోసం అలియా భట్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.నిర్మాత ఆమెకి ఏకంగా ఐదు కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నాడని, వాటితో పాటు, తన అసిస్టెంట్ లు, మేకప్, ట్రావెలింగ్ కోసం మరో ఐదు కోట్లు ఖర్చు పెడుతున్నాడని తెలుస్తుంది.

ఇంత మొత్తం ఆమెకి ఇవ్వడానికి కారణం ప్రస్తుతం బాలీవుడ్ లో ఆమె క్రేజ్ అని తెలుస్తుంది.మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.