'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీ గురించి ఆ మూడు విషయాలపై క్లారిటీ

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.భారీ బడ్జెట్‌తో అంటూ మొదటి నుండి ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే.

 Rrr Movie Producer Given The Clarity About Movie Budjet And Ramcharan-TeluguStop.com

అయితే ఈ చిత్రం బడ్జెట్‌ ఎంత అనే విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వని నిర్మాత తాజాగా ఈ చిత్ర బడ్జెట్‌ విషయమై క్లారిటీ ఇవ్వడం జరిగింది.ఈ చిత్రంకు నిర్మాత దానయ్య దాదాపుగా 300 కోట్ల పెట్టుబడి పెడుతున్నాడు.

ఈ 300 కోట్లలో దాదాపుగా 100 కోట్ల వరకు పారితోషికాలు, 75 కోట్ల వరకు సెట్టింగ్స్‌కు ఖర్చు చేస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

Telugu Balgeria, Bhabubali, Rajamouli, Ramcharan Rrr, Rrrbudjet-

భారీ ఎత్తున అంచనాలున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం బడ్జెట్‌ విషయంలో క్లారిటీ వచ్చేసింది.జక్కన్న ఎంత బడ్జెట్‌ అనుకుంటే అంతటితోనే పూర్తి చేయగల సమర్ధుడు.అందుకే ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం 300 కోట్లతో పూర్తి అవ్వడం ఖాయం.

ఇక ఈ చిత్రం ఏ భాషలో తెరకెక్కుతుంది అనే విషయం గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతుంది.అసలు ఈ చిత్రంను హిందీలో తెరకెక్కించి ఇతర భాషల్లో డబ్‌ చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

కాని సినిమా మొత్తం కూడా తెలుగులోనే షూటింగ్‌ చేస్తున్నారు.అన్ని తెలుగు నేటివిటీకి దగ్గరగానే ఉండేలా చేస్తున్నారు.

తెలుగు నుండి ఇతర భాషల్లోకి డబ్బింగ్‌ కానుంది.

ఇక చివరకు ఈ చిత్రం తాజా షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌ మాత్రమే షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.

రెండు వారాలైనా బల్గేరియాలో ఎన్టీఆర్‌తో పాటు రామ్‌ చరణ్‌ షూటింగ్‌లో పాల్గొనడం లేదు.ఈ విషయమై ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.ఎందుకు ఇలా అనే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదని భావిస్తున్న తరుణంలో నిర్మాణ సంస్థ నుండి ఒక ప్రకటన వచ్చింది.ప్రస్తుతం బల్గేరియాలో ఎన్టీఆర్‌పై ప్రధాన సీన్స్‌ చిత్రీకరణ జరుగుతున్నాయి.

ఇక చరణ్‌ తదుపరి షెడ్యూల్‌ కోసం రెడీ అవుతున్నాడు.ఆ షెడ్యూల్‌లో చరణ్‌ పై చిత్రీకరణ చేస్తామని అన్నారు.

దీంతో సినిమాపై ఉన్న అనుమానాలు అన్ని క్లారిటీ వచ్చేసినట్లయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube