తెలుగులో ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జక్కన్న “ఎస్ఎస్ రాజమౌళి” ఆర్.ఆర్.
ఆర్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.కాగా ఈ చిత్రానికి తెలుగు ప్రముఖ సినీ రైటర్ “కే.
వి విజయేంద్ర ప్రసాద్” కథని అందించగా టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత “డివివి దానయ్య” నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.ఈ చిత్రం కోసం నిర్మాతలు దాదాపు 400 కోట్ల రూపాయలకు పైగా నటించినట్లు సమాచారం.
అయితే ఈ చిత్రంలో టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరోలైన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తుండగా బాలీవుడ్ ప్రముఖ హీరో అజయ్ దేవగన్, శ్రియా శరణ్, హాలీవుడ్ ప్రముఖ నటి ఓలివియా మోరిస్, తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.
అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తయి విడుదల కావాల్సి ఉండగా గత సంవత్సర కాలంగా కరోనా వైరస్ కారణంగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులను తాత్కాలికంగా వాయిదా వేశారు.
దీంతో ఈ చిత్ర విడుదలకు సంబంధించిన డేట్లు కూడా ఎప్పటికప్పుడు మారుతూనే వచ్చాయి.అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లను చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు.
కాగా ఇందులో రామ్ చరణ్ తేజ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ఓకే మోటార్ సైకిల్ పై వెళుతూ కనిపించారు.
దీంతో ఈ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.కానీ మీమ్ క్రియేటర్స్ మాత్రం ఈ పోస్టర్ ని ఎడిట్ చేస్తూ ఓ రేంజ్ లో వైరల్ చేశారు.ఇందులో ముఖ్యంగా ఈ పోస్టర్ ని ఎడిట్ చేస్తూ అలియా భట్ మరియు ఓలివియా మోరిస్ ఒకే బైక్ పై వెళ్తుండగా రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ వెనక నుంచి వెళుతూ “తొందరగా వెళ్ళు మామ వెళ్ళిపోతున్నారంటూ” ఫన్నీ గా మీమ్ క్రియేట్ చేసారు.
అలాగే ఈ పోస్టర్ పై రాజమౌళి స్పందిస్తూ ఫ్రీడమ్ ఫైటర్స్ ని రోడ్ సైడ్ రోమియోలని చేశారు కదరా.? అంటూ ఫన్నీ ఎక్స్ ప్రెషన్ ఇచ్చినట్లు కూడా జోడించారు.దీంతో ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ 13వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మాండంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.
కానీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా పలు చోట్ల సినిమా థియేటర్లు మూత పడటంతో అనుకున్న తేదీకే ఈ చిత్రాన్ని చిత్ర యూనిట్ సభ్యులు రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.
ఈ చిత్రానికి కథ అందించిన ప్రముఖ సినీ రచయిత కే.వి విజయేంద్ర ప్రసాద్ ఆ మధ్య ఓ ప్రముఖ టీవీ ఛానల్ షో లో పాల్గొని ఈ చిత్రంలో రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య సాగే ఫైట్ సన్నివేశాలు మొత్తం చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయని చెప్పడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.మరి ఆర్.ఆర్.ఆర్ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.