మొదలైన ఆర్ఆర్ఆర్ బిజినెస్.. ఓవర్సీస్ హక్కులు ఎంతంటే..?

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి 2 సినిమా అంచనాలకు అందని స్థాయిలో భారీ కలెక్షన్లను సాధించడంతో పాటు కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.బాహుబలి 2 తర్వాత రాజమౌళి దర్శకత్వంలో చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

 Rrr Movie Overseas Rights Sold 68 Crore Rupees, Rajamouli, Ram Charan Ntr, Fans,-TeluguStop.com

దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ను ప్రకటించడంతో ఈ సినిమా బిజినెస్ ఇప్పటికే ప్రారంభమైందని తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగు, తమిళ భాషల ఓవర్సీస్ హక్కులు ఏకంగా 68 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.అయితే ఈ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

కరోనా మహమ్మారి విజృంభణ తరువాత ఓవర్సీస్ లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

Telugu Fans, Distributors, Rajamouli, Ram Charan Ntr, Rrr, Telugu Tamil-Latest N

అయితే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల నాటికి సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని భావించి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా హక్కులపై భారీ మొత్తం ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది.తెలుగు, తమిళ భాషల ఓవర్సీస్ రైట్స్ కే 68 కోట్ల రూపాయలని వార్తలు వస్తుండగా ఇతర భాషల హక్కులను కూడా విక్రయిస్తే ఆర్ఆర్ఆర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లో సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశాలు ఉంటాయి.

మరోవైపు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులకు సైతం విపరీతమైన పోటీ నెలకొందని తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ సినిమా 300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.

అటు చరణ్ ఫ్యాన్స్ ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా తమ ఫేవరెట్ హీరోలకు పాన్ ఇండియా ఇమేజ్ ను తెస్తుందని అభిప్రాయపడుతున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube