ఓటీటీలో ఆర్ఆర్ఆర్ స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడేనా.. ఎదురుచూపులు తప్పవంటూ?

ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ భారీ స్థాయిలోనే కలెక్షన్లను సాధిస్తోంది.కేజీఎఫ్2 సినిమా వల్ల ఆర్ఆర్ఆర్ కలెక్షన్లు తగ్గినా ఇప్పటివరకు ఈ సినిమాను చూడని వాళ్లు థియేటర్లలో ఈ సినిమాను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.అయితే ఆర్ఆర్ఆర్ ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి.

 Rrr Movie Ott Streaming Rights Details Here Goes Viral ,  Ott Version ,  Rrr Mov-TeluguStop.com

అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం జూన్ నెల 3వ తేదీ నుంచి ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.ఆర్ఆర్ఆర్ ను ఓటీటీలో చూడాలని భావించే వాళ్లకు ఎదురుచూపులు తప్పవని చెప్పవచ్చు.జీ5 ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుండగా ఆర్ఆర్ఆర్ ఫుల్ రన్ ముగిసిన తర్వాత ఓటీటీ రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.ఆర్ఆర్ఆర్ మూవీలో డిలీట్ చేసిన కొన్ని సీన్లు ఓటీటీ వెర్షన్ లో ఉంటాయని వార్తలు వస్తున్నాయి.

Telugu Charan, Managers, June, Kgf, Ott, Rrr, Tarak-Movie

మరోవైపు ఆర్ఆర్ఆర్ ఓటీటీలో అంచనాలకు మించి హిట్ కావడంతో పాటు సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరగడానికి కారణమవుతుందని జీ5 నిర్వాహకులు భావిస్తున్నారు.ఓటీటీలో ఆర్ఆర్ఆర్ సంచలన రికార్డులను సొంతం చేసుకుంటుందని ఆర్ఆర్ఆర్ అభిమానులు సైతం కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Telugu Charan, Managers, June, Kgf, Ott, Rrr, Tarak-Movie

ఎన్టీఆర్ హైలెట్ గా నిలిచే కొన్ని సన్నివేశాలు ఎడిటింగ్ లో పోయాయని తెలుస్తోంది.ఆర్ఆర్ఆర్ నిడివి 4 గంటల వరకు వచ్చిందని సినిమాలోని చాలా ముఖ్యమైన సన్నివేశాలు ఎడిటింగ్ లో పోయాయని సమాచారం అందుతోంది.ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో చరణ్, తారక్ ఫ్యాన్స్ చాలా సంతోషిస్తున్నారు.ఆర్ఆర్ఆర్ ఇప్పటికే 1100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube