ఆర్‌ఆర్‌ఆర్‌ : ఎన్టీఆర్‌ వీడియో పనులు ఎక్కడి వరకు వచ్చాయి

ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రామ్ చరణ్ ఫస్ట్ లుక్ విడుదలైంది.

 Rrr Movie Ntr Look Ramaraju For Bheem Video Rrr, Ntr, Rajamouli, Ramaraju For Bh-TeluguStop.com

ఆయన బర్త్ డే సందర్భంగా విడుదలైన వీడియో కి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఎన్టీఆర్ బర్త్ డే కి కూడా కొమురం భీం లుక్ ను మరియు వీడియోను విడుదల చేయాల్సి ఉంది.

కానీ కరోనా లాక్డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది.ఆ కారణంగానే ఎన్టీఆర్‌ లుక్‌ వీడియో విడుదల చేయడం జరగలేదు.

ఎన్టీఆర్ కి సంబంధించిన విజువల్స్ లేకపోవడం వల్ల ప్రోమో వీడియో ని విడుదల చేయడానికి సాధ్యపడలేదు.ఎట్టకేలకు ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత రాజమౌళి టీం షూటింగ్ కి దిగింది.

షూటింగ్‌ పునః ప్రారంభించిన వెంటనే ఎన్టీఆర్ కి సంబంధించిన ప్రోమో వీడియో కోసం కొన్ని షాట్స్‌ ను చిత్రీకరించారు.ఎన్టీఆర్‌ పై కొన్ని కీలకమైన షాట్స్ ను చిత్రీకరించారట.

అంతకు ముందు చిత్రీకరించినవి మరియు ఇప్పుడు చిత్రీకరించినవి కలిపి ఒక ప్రోమోను తయారు చేయడం జరిగింది.దానికి రామ్‌ చరణ్‌ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడు.

ప్రోమో కోసం రెండు మూడు రోజులు టైం కేటాయించి మరీ రాజమౌళి ఎడిట్ చేయిస్తున్నాడు.రాజమౌళి తనయుడు కార్తికేయ ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీనిని రూపొందిస్తున్నట్లు గా తెలుస్తోంది.

ఒకటి రెండు రోజుల్లోనే ఎన్టీఆర్ ప్రోమో రెడీ అయ్యే అవకాశం ఉంది.ఇప్పటికే చెప్పినట్లుగా ఈనెల 22వ తారీఖున కొమురం భీం వీడియో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

రామరాజు ఫర్‌ భీమ్‌ అంటూ రాబోతున్న ఈ వీడియో కోసం మెగా నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube