ఆర్‌ఆర్‌ఆర్‌ : ఇదుగో ఎన్టీఆర్‌కు జోడీ ఇంగ్లీష్‌ పిల్ల

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ హీరోలుగా తెరకెక్కిస్తున్నాడు.

 Rrr Movie Latest News About Ntr-TeluguStop.com

బాహుబలి వంటి అంతర్జాతీయ స్థాయి సినిమా తర్వాత జక్కన్న తెరకెక్కిస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

Telugu Ntr Charan, Rajamouli, Rrr Latest Ntr-

ఇక ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌కు జోడీగా ఆలియా భట్‌ నటిస్తుండగా ఎన్టీఆర్‌కు జోడీగా ఒక హాలీవుడ్‌ నటిని ఎంపిక చేయడం జరిగింది.కాని ఆమె షూటింగ్‌ ఆలస్యం అవ్వడం మరియు ఇతరత్ర కారణాల వల్ల సినిమాకు నో చెప్పింది.ఆమె స్థానంలో ఎవరు నటిస్తారా అంటూ అంతా చర్చలు జరిగాయి.అసలు ఇంగ్లీష్‌ అమ్మాయి కాకుండా బాలీవుడ్‌ ముద్దుగుమ్మనే ఎన్టీఆర్‌ కోసం కూడా ఎంపిక చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

ఎట్టకేలకు సినిమాకు సంబంధించిన క్లారిటీ జక్కన్న ఇచ్చాడు.

Telugu Ntr Charan, Rajamouli, Rrr Latest Ntr-

ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా అందాల హాలీవుడ్‌ నటి ఒలివియా మోరిస్‌ ను ఎంపిక చేశారట.ఈ విషయాన్ని స్వయంగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.ఎన్టీఆర్‌కు జోడీ అదిరింది అంటూ నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా 80 శాతం షూటింగ్‌ అయ్యిందని అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేస్తామంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube