అమెరికాలో ఎన్టీఆర్ ఫ్యాన్ అరాచకం.. ఆర్ఆర్ఆర్ టికెట్లు ఎన్ని కొన్నాడంటే?

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్.

ఈ సినిమా కోసం తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే ఈ నెలలో రెండు బిగ్గెస్ట్ సినిమాలు థియేటర్స్ లో సందడి చేయబోతున్నాయి.అందులో ఒకటి రాధే శ్యామ్ సినిమా కాగా మరొకటి ఆర్ఆర్ఆర్ సినిమా.

రాధేశ్యామ్ సినిమా మార్చి 11న విడుదల కానుండగా,ఆర్ఆర్ఆర్ ఈ సినిమా మార్చి 25న విడుదల కానుంది.రెండు పాన్ ఇండియా సినిమాలు ఒకేసారి విడుదల అవుతుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఇక ఇప్పటికే సినిమాను విడుదల చేయడానికి ఏర్పాట్లు అన్ని ఘనంగా జరుగుతున్నాయి.ఇది ఇలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని చేసిన ఒక పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

అమెరికాలో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు టికెట్ అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది.

ఈ నేపథ్యంలోనే ఊహించినట్లుగా గంటల వ్యవధిలోనే టిక్కెట్లు అమ్ముడయ్యాయి.తాజాగా అమెరికాలోని డల్లాస్ నగరంలోని గెలాక్సీ థియేటర్ లో ఎన్టీఆర్ వీరాభిమాని ఏకంగా 75 టిక్కెట్ కొనుగోలు చేసి ఆశ్చర్యానికి గురి చేశాడు.ఎందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.డివివి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విషయం తెలిసిందే.

చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!
Advertisement

తాజా వార్తలు