వీడియో : RRR జననితో ఒల్లు పులకరింపు

వీడియో : RRR జననితో ఒల్లు పులకరింపు

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా నుండి మరో పాట వచ్చింది.జనని అంటూ సాగిన ఈ పాట ఒళ్ళు పులకరించే విజువల్స్ తో అద్భుతమైన మ్యూజిక్ తో ఆకట్టుకునేలా ఉంది.

 వీడియో : Rrr జననితో ఒల్లు పులకరింపు-TeluguStop.com

రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ లుక్ మరియు సన్నివేశాల విజువల్స్ సినిమా స్థాయిని మరింతగా పెంచాయి అనడంలో సందేహం లేదు.ఈ పాట దేశ భక్తి తో పాటు ఈ సినిమా లోని రాజమౌళి అద్బుతంగా చూపించాలనుకున్న విజువల్స్ ని చూపించడం జరిగింది.

ప్రతి సన్నివేశంను కూడా అద్బుతంగా జక్కన్న తెరకెక్కిస్తాడు.అద్భుతమైన కాన్సెప్ట్ తో దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించాడు అనడంలో సందేహం లేదు.

 వీడియో : RRR జననితో ఒల్లు పులకరింపు-వీడియో : RRR జననితో ఒల్లు పులకరింపు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు గా ఎన్టీఆర్ కొమరం భీమ్ కనిపించబోతున్న ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.ఆయన భార్యగా శ్రేయ శరణ్ నటించిన విషయం తెలిసిందే.

ఇక రామ్ చరణ్ కు జోడీ గా ఆలియా భట్ నటించింది.ఆమె కూడా ఈ జనని సాంగ్ లో కనిపించి ఆకట్టుకుంది.

ఆమె లుక్ ను కూడా ఈ జనని సాంగ్ లో చూపించారు.జక్కన్న ఏం చేసినా కూడా సినిమా పెరిగిపోతూనే ఉంటుంది.ఈ సినిమా రేంజ్ మరో సారి జనం ఈ పాట తో పెరిగిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.జనవరి ఏడవ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆర్ ఆర్ ఆర్‌ సినిమా బాహుబలి ని మించి ఉంటుందని అభిమానులు ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.

తెలుగు సినిమా స్థాయిని బాహుబలితో ఇండియన్ బాక్సాఫీస్ వద్దకు చేర్చిన రాజమౌళి ఈ సినిమా తో పాన్ వరల్డ్ డైరెక్టర్ గా మారే అవకాశాలు ఉన్నాయంటూ నెటిజన్స్ మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

#Janani #Rajamouli #Rrr #Rrr

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube