యూట్యూబ్‌ లో 'ఆర్ఆర్ఆర్‌' మొత్తం.. రంగంలోకి దిగిన జక్కన్న టీమ్‌

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమా కు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం యూ ట్యూబ్ లో చక్కెర్లు కొడుతున్నాయి.నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేటర్లలో షూట్ చేసి చిన్న చిన్న బిట్లు గా మూడు నాలుగు నిమిషాల వీడియోలుగా యూట్యూబ్లో షేర్‌ చేస్తున్నారు.

 Rrr Movie In Youtube Now Jakkanna Rajamouli Team Entry ,  Film News , Ntr , Raja-TeluguStop.com

దాదాపు సినిమా అంతా కూడా వేలాది వీడియో రూపం లో యూట్యూబ్ లో ఉండి పోయింది.సినిమా సంబంధించిన అత్యంత కీలక సన్నివేశాలను మరియు యాక్షన్ సన్నివేశాలను.

హీరోల ఎంట్రీ సన్నివేశాలను ఇలా ప్రతి ఒక్క సన్నివేశాలను యూట్యూబ్ లో ఉంచడంతో ప్రేక్షకులు వాటిని చూసి ఈ సినిమా విషయం లో ఆసక్తి ఉన్నా వెళ్లక పోవడానికి దారి తీస్తుంది.అందుకే ఈ సినిమా ను వెంటనే యూట్యూబ్ నుండి తొలగించే చర్యలు తీసుకునేందుకు జక్కన్న టీమ్‌ రంగం లోకి దిగినట్లు తెలుస్తోంది.

Telugu Jakkanna, Rajamouli, Ram Charan, Youtube-Movie

ఈ మధ్య కాలం లో కొత్త సినిమా లకు పెద్ద సినిమాలకు ఇలాంటి ఇబ్బందులు తప్పడం లేదు.యూట్యూబ్ లో ఈ వీడియోలో రెండు మూడు రోజులు హడావుడి చేయడం చాలా కామన్ గా జరుగుతుంది.ఆ తర్వాత సాఫీగా యూట్యూబ్ వారు ఈ వీడియోలను తొలగిస్తున్నారు.ఇలాంటి యూట్యూబ్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యం లో సినిమాకు సంబంధించిన ఆసక్తి మరియు ఉత్సుకథ దెబ్బ తింటుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అభిమానులు రిక్వెస్ట్ చేసినా.చిత్ర యూనిట్ సభ్యులు ఎంతగా ప్రాదేయ పడినా కొందరు మాత్రం యూట్యూబ్ లో పెట్టకుండా ఉండటం లేదు.మూడు నాలుగు నిమిషాల నిడివి వీడియో లను చూస్తున్న ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తి తగ్గుతుంది అంటూ ఆందోళన వ్యక్తమవుతోంది.వందల కోట్ల బడ్జెట్ తో నిర్మించిన సినిమా లను ఇలా యూట్యూబ్ లో పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అనేది ప్రేక్షకులు ఆలోచించుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube