ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోల పాత్రల పేర్లు పరిచయం చేసిన రాజమౌళి

టాలీవుడ్ లో దర్శక దిగ్గజం రాజమౌళి నుంచి వస్తున్న మరో భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్.డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

 Rrr Movie Friendship Day Update-TeluguStop.com

స్వాతంత్రోద్యమ కాలంనాటి కథాంశంతో రాజమౌళి ఈ సినిమాను ఆవిష్కరిస్తాడు.ఇక ఈ సినిమాలో స్టార్ హీరోలైన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన పాత్రలను పోషిస్తున్నారు.

అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల స్ఫూర్తితో రాజమౌళి ఈ రెండు పాత్రలను డిజైన్ చేసుకున్న సంగతి ఇప్పటికే స్పష్టం చేశారు.

ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోల పాత�

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ పాత్రల పేర్లను రాజమౌళి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ప్రకటించాడు.రామ్ చరణ్ రామరాజు పాత్రలో, భీమ్ పాత్రలో ఎన్టీఆర్ చేస్తున్నారు.

ఇక వీళ్ళిద్దరూ కలిసి బ్రిటిష్ వారి పైన చేసే పోరాటమే ఈ చిత్ర కథ అనేది తెలుస్తుంది.ఫ్రెండ్ షిప్ అనేది ఎప్పుడు, ఎలా పుడుతుందో చెప్పలేం ఇందులో రామరాజు, భీమ్ ల స్నేహంలా అంటూ రాజమౌళి పోస్ట్ పెట్టాడు.

ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక తాజా సమాచారం ప్రకారం అం 2020 జూన్లో ఈ సినిమాని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

మరి ఈ సినిమాతో రాజమౌళి మరోసారి ఏ స్థాయిలో అద్భుతం చేస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube