వీడియో : చరిత్రలో నిలిచి పోయేలా ఉన్న 'దోస్తీ'

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్‌ ఆర్ సినిమా చరిత్ర లో నిలిచి పోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.అద్బుతమైన పాటలు ఈ సినిమా లో ఉంటాయని ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉన్నారు.

 Rrr Movie Dosti Song Goes Viral In Youtube-TeluguStop.com

ఇప్పుడు ఆ నమ్మకం నిలిచే విధంగా స్నేహితుల దినోత్సవం సందర్బంగా దోస్తీ పాటను విడుదల చేశారు.కన్నుల వింధుగా చెవులకు పొందుగా అన్నట్లుగా పాట ఉంది.

ఆకట్టుకునే విధంగా ఉండటంతో పాటు సినిమా ను కూడా దర్శకుడు రాజమౌళి ఇలాగే తెరకెక్కించడం ఖాయం అంటూ నమ్మకంను ఈ పాట వ్యక్తం చేస్తోంది.దోస్తీ పాట చరిత్ర లో నిలిచి పోయేలా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

 Rrr Movie Dosti Song Goes Viral In Youtube-వీడియో : చరిత్రలో నిలిచి పోయేలా ఉన్న దోస్తీ’-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కీరవాణి నుండి వచ్చిన ఈ అద్బుతంను మళ్లీ మళ్లీ వినాల్సిందిగా చాలా మంది కోరుకుంటున్నారు.

సోషల్‌ మీడియా లో పెద్ద ఎత్తు ఈ పాట వైరల్‌ అవుతోంది.సినిమా ను ఆకాశమే హద్దు అన్నట్లుగా పైకి తీసుకు వెళ్లిన ఈ పాట ముందు ముందు మరింత పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.సోషల్‌ మీడియాలో సినిమా పాట గురించి జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో అతి తక్కువ సమయంలోనే అత్యధిక వ్యూస్ ను దక్కించుకోబోతున్న పాటగా ఈ పాట నిలుస్తుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.

ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా ను వచ్చే దసరాకు విడుదల చేయబోతున్నారు.అక్టోబర్ లో విడుదల కావాల్సిన ఈ సినిమాకు సంబంధించిన ఈ ప్రమోషనల్‌ వీడియో అద్బుతంగా వచ్చిందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

మొత్తానికి ఆర్ ఆర్‌ ఆర్‌ స్థాయిని మళ్లీ మళ్లీ జక్కన్న పెంచుతూనే ఉన్నాడు.రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ ల ఫొటోలు ఈ వీడియో నుండి తీసి తెగ షేర్‌ చేస్తున్నారు.

#Ram Charan #Dosti #Kiravani #Dosti #RRRMovie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు