రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టార్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు.
అయితే ఈ సినిమా ఇంకా విడుదలకు చాలా సమయం ఉన్నా అప్పుడే డిజిటల్ రైట్స్ కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ బడా సంస్థ ఆర్ ఆర్ ఆర్ సినిమా శాటిలైట్ హక్కులను దక్కించుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు.బాలీవుడ్ ప్రముఖ సంస్థ అయిన పెన్ స్టూడియోస్ వారు ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎలక్ట్రానిక్, డిజిటల్, శాటిలైట్ రైట్స్ ను దక్కించుకుంది.
ఈ మేరకు తాజాగా పెన్ స్టూడియోస్ వారు అధికారికంగా ప్రకటించారు.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మేము సమర్పిస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అని పెన్ స్టూడియోస్ తెలిపింది.
పెన్ స్టూడియోస్ నార్త్ థియేట్రికల్ రైట్స్ తో పాటు అన్ని భాషల్లో ఎలక్ట్రానిక్, డిజిటల్, సాటిలైట్ హక్కులు సొంతం చేసుకుంది.ఈ హక్కుల కోసం పెన్ స్టూడియోస్ వారు భారీ మొత్తాన్ని చెల్లించినట్టుగా తెలుస్తుంది.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.డివివి దానయ్య ఈ సినిమాను 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన విదేశీ భామ ఒలీవియా మోరిస్ నటిస్తుంటే, రామ్ చరణ్ కు జోడీగా ఆలియా భట్ నటిస్తుంది.
ఈ సినిమాను రాజమౌళి అక్టోబర్ 13 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.