ఆర్ఆర్ఆర్ లో చిన్నప్పటి హీరో పాత్రలని పరిచయం చేసిన జక్కన్న  

RRR Movie Child Characters Artist Pics Viral in Social Media, Tollywood, Telugu Cinema, Rajamouli, RRR Movie, Jr NTR, Ram charan - Telugu Jr Ntr, Rajamouli, Ram Charan, Rrr Movie, Rrr Movie Child Characters Artist Pics Viral In Social Media, Telugu Cinema, Tollywood

బాహుబలి తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళి నుంచి వస్తున్న మరో మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్.ఈ సినిమా మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.అయితే లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.భారీ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ మళ్ళీ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది చిత్ర యూనిట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు.

TeluguStop.com - Rrr Movie Child Characters Artist Pics Viral In Social Media

షూటింగ్ లకి పర్మిషన్ ఇచ్చినా కూడా ఆర్ఆర్ఆర్ లాంటి హ్యూజ్ క్యాస్టింగ్ ఉన్న సినిమాలు షూటింగ్ చేయాలంటే వందల మంది వర్క్ చేయాల్సి ఉంటుంది.అయితే ఆ వంద లోపు క్రౌడ్ ఉండే విధంగా షూటింగ్ ప్లాన్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.

ఈ నేపధ్యంలో జక్కన్న ఈ సినిమా కోసం మరికొంత కాలం వేచి చూసేలా ఉన్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్ ల ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.

TeluguStop.com - ఆర్ఆర్ఆర్ లో చిన్నప్పటి హీరో పాత్రలని పరిచయం చేసిన జక్కన్న-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

సినిమాలో నటిస్తున్న ముగ్గురు బాల నటీనటుల ఫొటోలు వైరల్ గా మారాయి.కొమరామ్ భీం, అల్లూరి సీతారామరాజు పాత్రలతో ఈ సినిమా సాగుతుందనే విషయం తెలిసిందే.

ఈ నేపధ్యంలో వారి చిన్నతనం నుంచి కథని దర్శకుడు రాజమౌళి చూపించబోతున్నారు.అందులో భాగంగానే అల్లూరి సీతారామరాజు, కొమరామ్ భీం పాత్రలకు చిన్న పిల్లలను నటింపజేశారు.

ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు ఆలియా భట్ ల చిన్నప్పటి పాత్రల్లో నటించిన పిల్లల ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈచిన్నారులు రాజమౌళి, ఎన్టీఆర్, శ్రియ, అజయ్ దేవగన్ లతో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్ష్యం అవ్వడంతో తెగ షేర్ చేస్తున్నారు.

ఈ ఫోటోలు కారణంగా ఆర్ఆర్ఆర్ గురించి మళ్ళీ సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది.

ఇప్పటికే పిల్లలపై షూటింగ్ పూర్తి అయినట్లుగా దీన్ని బట్టి అర్థం అవుతోంది.

సినిమాకు సంబంధించిన చిన్న విషయం కూడా చాలా ప్రచారం జరుగుతుంది.అలాంటిది ఈ సినిమాలో పిల్లలుగా నటిస్తున్న వీరి గురించి ప్రముఖంగా మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

రాజమౌళి ఎన్టీఆర్.చరణ్ ఇంకా ఆలియా పాత్రల చిన్నప్పటి పాత్రలకు చక్కగా సూట్ అయ్యే వారిని ఎంపిక చేశారు.

ఎన్టీఆర్ చిన్నతనంలో అలాగే ఉండేవాడా అన్నట్లుగా ఆ చిన్న కొమురం భీం ఉన్నాడు.ఆలియా చిన్నతనంలో ఇలాగే ఉండేది అన్నట్లుగా చిన్న సీత ఉంది

.

#RRRMovie #Rajamouli #Ram Charan #Jr NTR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rrr Movie Child Characters Artist Pics Viral In Social Media Related Telugu News,Photos/Pics,Images..