చరణ్ విషయంలో తప్పిన రాజమౌళి ఫాలసీ !

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ దర్శకుల్లో దర్శక ధీరుడు రాజమౌళి ముందు వరుసలో ఉంటాడు.ఇప్పటి వరకు తన కెరీర్ లో ఒక్క ప్లాప్ కూడా లేకుండా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నాడు.

 Rrr Movie And Acharya Movie Latest Update-TeluguStop.com

బాహుబలి సినిమాతో తన టాలెంట్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.అంతేకాదు తెలుగు కీర్తిని ప్రపంచ నలుమూలల వ్యాపించేలా చేసాడు.

ఈ సినిమా తర్వాత తెలుగు సినీ పరిశ్రమ మరింత గుర్తింపు తెచ్చుకుంది.

 Rrr Movie And Acharya Movie Latest Update-చరణ్ విషయంలో తప్పిన రాజమౌళి ఫాలసీ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కేవలం బాహుబలి సినిమా కారణంగానే ఈ రోజు మన తెలుగు హీరోలు వరసపెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే రాజమౌళి సినిమాల్లో నటించడానికి మన హీరోలు పోటీ పడుతుంటారు.ఎందుకంటే ఆయనతో సినిమా అంటే ఖచ్చితంగా స్టార్ హీరో అయిపోయినట్టే.అయితే ఈయన సినిమాల్లో నటించే హీరోలు ఆ సినిమా పూర్తి అయ్యే వరకు మరొక సినిమా చేయరు.

Telugu Acharya Movie, Ntr, Rajamouli, Ram Charan, Rrr Movie, Rrr Movie And Acharya Movie Latest Update-Movie

ఎన్ని సంవత్సరాలు అయినా అదే సినిమా కోసం కష్టపడతారు.అయితే రాజమౌళి సూపర్ హిట్ సినిమాను హీరోల చేతిలో పెట్టి వారి కష్టానికి తగిన ప్రతిఫలం అందిస్తాడు.ఇప్పటి వరకు ఏ హీరో కూడా రాజమౌళితో సినిమా చేస్తూ మరొక సినిమా చేయలేదు.

కానీ చరణ్ విషయంలో మాత్రం ఈ ఫిలాసఫీ ఏమి పనిచేయలేదు.ప్రస్తుతం చరణ్ ఒకవైపై ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తూనే మరొక వైపు ఆచార్య సినిమాలో కూడా నటిస్తున్నాడు.

అయితే ఆచార్యలో కేవలం గెస్ట్ రోల్ కాదు.సెకండ్ హీరో అన్న రేంజ్ లో చరణ్ పాత్ర ఉండబోతుందని తెలుస్తుంది.కరోనా సెకండ్ వేవ్ తర్వాత మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ షూట్ లో చరణ్ అప్పుడే పాల్గొన్నాడు.అయితే ఇప్పుడు ఆచార్య సినిమా షూట్ లో కూడా పాల్గొనబోతున్నాడని తెలుస్తుంది.

Telugu Acharya Movie, Ntr, Rajamouli, Ram Charan, Rrr Movie, Rrr Movie And Acharya Movie Latest Update-Movie

ఇంతకుముందుగ్యాప్ దొరికితే షూట్ లో పాల్గొనే చరణ్ ఇప్పుడు రెండు సినిమాలను ఒకేసారి చేయబోతున్నాడని టాక్.త్వరలోనే ఆచార్య షూట్ కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఒక్క రోజులోనే రెండు సినిమా షూటింగ్ బాలన్స్ చేయడానికి చరణ్ రెడీ అయ్యాడట.ఇంకా పది రోజుల షూట్ మాత్రమే బాలన్స్ ఉన్న ఆచార్య కోసం చరణ్ కాస్త ఇబ్బంది అయినా కూడా చేయబోతున్నాడట.మొత్తానికి ఏ హీరోకు దక్కని వెసులుబాటు చరణ్ కు దక్కిందని చెప్పాలి.

#Rajamouli #Ram Charan #RRRMovie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు