ఆర్‌ఆర్‌ఆర్ కు తప్పని లీకుల బెడద.. కీలక ఫొటోస్‌ లీక్‌..!

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ టాప్ హీరోల సినిమాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు విడుదలకు ముందే లీక్ అవుతూ ఉండటంతో ఆయా సినిమాల యూనిట్ కు తలనొప్పిగా మారింది.టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను కూడా లీకుల బెడద తప్పడం లేదు.

 Rrr Leaked Photos Goes Viral In Social Media-TeluguStop.com

తాజాగా ఈ సినిమా నుంచి కొన్ని కీలక ఫోటోలు లీక్ అయ్యాయి.లీకైన ఫోటోలు సినిమా ఇంట్రడక్షన్ సీన్ తో పాటు ముఖ్యమైన సన్నివేశాల ఫోటోలు అని తెలుస్తోంది.

ఎటువంటి ఫోటోలు, వీడియోలు లీక్ కాకుండా ఆర్‌ఆర్‌ఆర్ చిత్రయూనిట్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ ఫోటోలు ఎలా లీక్ అవుతున్నాయో చిత్రయూనిట్ కు కూడా అర్థం కావడం లేదు.లీకైన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 Rrr Leaked Photos Goes Viral In Social Media-ఆర్‌ఆర్‌ఆర్ కు తప్పని లీకుల బెడద.. కీలక ఫొటోస్‌ లీక్‌..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆర్‌ఆర్‌ఆర్ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తుండగా సినిమా ఇంట్రడక్షన్ సీన్ లో తారక్ పులితో తలపడనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.

తారక్ పులి ఎదురెదురుగా ఉన్న ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.ఈ ఫోటోలో ఎన్టీఆర్ కండలతో కొత్త లుక్ లో కనిపిస్తున్నారు.లీకైన ఇతర ఫోటోలతో చరణ్ లుక్ రివీల్ కావడంతో పాటు హీరోయిన్ కూడా ఉన్నారు.

ఈ ఫోటోలు లీక్ చేసిన వారిపై ఆర్‌ఆర్‌ఆర్ చిత్రయూనిట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.అయితే ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ మాత్రం లీకైన ఫోటోలను చూసి తమ ఫేవరెట్ హీరోలను రాజమౌళి అద్భుతంగా చూపించబోతున్నాడంటూ సంతోషపడుతున్నారు.

తెలుగుతో పాటు ఇతర భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా థియేట్రికల్ హక్కులతో పాటు డిజిటల్, శాటిలైట్ హక్కులకు భారీగా పోటీ నెలకొందని సమాచారం.అక్టోబర్ నెల 13వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.నిజ జీవిత పాత్రలను తీసుకుని కల్పిత కథతో దర్శకధీరుడు రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

#Social Media #Goes Viral

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు