ఆలస్యం అమృతం విషం ఈ సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది.ఆలస్యం జరిగింది అంటే అమృతం కూడా విషం లా మారిపోతుంది అని దీనికి అర్థం వస్తుంది.
అయితే ఇప్పుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ విషయంలో కూడా ఇలాంటిదే జరుగుతున్నట్లు తెలుస్తోంది.బాహుబలి లాంటి వరల్డ్ వైడ్ హిట్ తర్వాత రాజమౌళి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా బెస్ట్ డాన్సర్ గా ఉన్న రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో సినిమా తీస్తున్నా అంటూ చెప్పి అందరిలో భారీ అంచనాలను పెంచేశాడు.
రాజమౌళి సినిమా అంటేనే ఊహకందని విధంగా ఉంటుంది.ఇక ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా అంటే ఇంకా ఏ రేంజ్లో ఉండబోతుందో అని ఊహాలోకంలో తేలిపోయారు ప్రేక్షకులు.
ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక్కో అప్డేట్ విడుదల అవుతున్న కొద్దీ సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందా అని వేయికళ్ళతో ఎదురు చూశారు.కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడటం కూడా జరిగింది.
ఆ తర్వాత రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమా పై కాస్త హైప్ తగ్గింది.కానీ ఇక వరుసగా అప్డేట్లు విడుదల చేయడంతో మళ్లీ ఒకసారిగా హైప్ వచ్చేసింది.
ఇక ఇటీవలే సంక్రాంతి సందర్భంగా జనవరి 7వ తేదీన సినిమాను విడుదల చేస్తాం అని చెప్పడంతో అందరూ ఇక సినిమా చూసేందుకు ఫిక్స్ అయిపోయారు.సినిమా ప్రమోషన్స్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కూడా.
దీంతో ఇక త్రిబుల్ ఆర్ సినిమా పై హైప్ ఒక రేంజ్ లో పెరిగి పోయింది.కానీ చివరికి వైరస్ కారణంగా సినిమా మళ్ళీ వాయిదా పడే పరిస్థితి ఏర్పడింది.ఎప్పుడు విడుదల అవుతుంది అన్న దానిపై కూడా క్లారిటీ లేదు.ఇలాంటి సమయంలో ఇక రాజమౌళి ఆర్ఆర్ఆర్ మీద దృష్టిని మళ్లించి మహేష్ తో సినిమాకు సిద్ధమవుతున్నాడు అంటూ వార్తలు కూడా రావడం మొదలయ్యాయి.
దీంతో ఇక మొన్నటివరకు త్రిబుల్ ఆర్ సినిమా అంటే ప్రేక్షకులకు ఒక రేంజిలో అంచనాలు ఉండేవి.కానీ ఇప్పుడు మాత్రం ప్రేక్షకులు ఈ సినిమా విషయాన్నే మరిచిపోతున్నారు అన్నది తెలుస్తుంది.
అంతేకాదండోయ్ ఈ ఎన్నో ఏళ్ల పాటు విడుదలకు నోచుకోకుండా ఆలస్యంగా విడుదలైన ఎన్నో సినిమాలు ఆ తర్వాత అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఈ క్రమంలోనే ఇక రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమా విడుదల చేసే సమయానికి మళ్లీ ఎలా హైప్ క్రియేట్ చేస్తాడు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.