సైరా బాటలో ఆర్ఆర్ఆర్.. పరాభవం తప్పదా?  

Rrr Going In The Way Of Sye Raa - Telugu Alluri Seetharamaraju, Chiranjeevi, Komuram Bheem, Rrr, Sye Raa

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ ఇప్పటికే ఎలాంటి భారీ అంచనాలు క్రియేట్ చేసుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Rrr Going In The Way Of Sye Raa

ఇటీవల ఈ సినిమా టైటిల్ లోగోతో పాటు రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.

అయితే ఈ సినిమా కూడా మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డిలా వివాదాలకు తెరలేపేందుకు రెడీ అవుతోందని సినీ విమర్శకులు అంటున్నారు.

సైరా బాటలో ఆర్ఆర్ఆర్.. పరాభవం తప్పదా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

గతంలో వచ్చిన సైరా నరసింహా రెడ్డి చిత్రాన్ని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యులకు చూపెట్టకుండానే రిలీజ్ చేశారని, ఆ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని వారు ఆరోపించారు.దీంతో ఆ వివాదం ఎంతలా హల్‌చల్ క్రియేట్ చేసిందో అంరికీ తెలిసిందే.

ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌లో కూడా అల్లూరి సీతారామరాజుకు సంబంధించి ఓ వివాదం రేకెత్తింది.ఈ సినిమాలో రామ్ చరణ్ ఖాకీ ప్యాంట్ వేసుకుని బాక్సింగ్ చేస్తూ కనిపించాడు.

అయితే అల్లూరి సీతారామరాజు ప్యాంట్‌ వేసుకునేవాడు కాదని, ఆయన సంప్రదాయ దుస్తులనే ధరించేవాడని కొందరు చరిత్రకారులు అంటున్నారు.ఇక కొమురం భీం పాత్రలో కూడా ఇలాంటి వివాదాలకు తెరలేపుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Rrr Going In The Way Of Sye Raa Related Telugu News,Photos/Pics,Images..