ఆర్ఆర్ఆర్ ఫస్ట్ గిఫ్ట్.. ఉందో లేదో?

ప్రస్తుతం తెరకెక్కుతున్న ప్రెస్టిజీయస్ సినిమాల్లో ఆర్ఆర్ఆర్ ఒకటి అని చెప్పాలి.దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయనున్నారు.

 Rrr First Look Poster On January 1st-TeluguStop.com

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తు్న్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే సినిమాకు సంబంధించి ఎలాంటి లీకులు లేకుండా జక్కన్న పక్కా ప్లానింగ్‌తో ముందుకెళుతున్నాడు.దీంతో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్‌పై ప్రేక్షకుల్లో అయోమయం నెలకొంది.

న్యూ ఇయర్ కానుకగా ఆర్ఆర్ఆర్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.అయితే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం ఇప్పటివరకు రాలేదు.

కాగా న్యూ ఇయర్ కానుకగా చిత్ర ఫస్ట్‌ లుక్ పోస్టర్ నుండి సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టాలని జక్కన్న చూస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే 80 శాతం చిత్ర షూటింగ్ పూర్తికాగా ఈ సినిమాను జూలౌ 30, 2020లో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

మరి న్యూ ఇయర్ రోజున ఆర్ఆర్ఆర్ ప్రేక్షకులకు ఎలాంటి గిఫ్ట్ ఇస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube