అన్ని సినిమాలను ఆగం చేస్తున్న ఆర్ఆర్ఆర్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయంగా పెంచేశారు.ఇక ఈ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Rrr Exit Form Dasara Will Effect Other Movies, Rrr, Rajamouli, Ntr, Ram Charan,-TeluguStop.com

ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా దర్శకుడు జక్కన్న తెరకెక్కిస్తుండటంతో ఆర్ఆర్ఆర్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను అక్టోబర్ 13న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో మరోసారి చిత్ర యూనిట్ వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది.ఇంకా ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తికాకపోవడం, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంతటి భారీ చిత్రాన్ని రిలీజ్ చేయడం కూడా సరైనది కాదని చిత్ర యూనిట్ భావిస్తోంది.

దీంతో ఆర్ఆర్ఆర్ చిత్రం దాదాపు దసరాకు రిలీజ్ కాదని తెలుస్తోంది.ఇక ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా కూడా రిలీజ్‌ను పోస్ట్‌పోన్ చేస్తుండటంతో ఈ ఎఫెక్ట్ రాబోయే చాలా సినిమాలపై పడనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రిలీజ్‌ను పలుమార్లు వాయిదా వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, బాలయ్య నటించిన అఖండ నుండి మొదలుకొని అల్లు అర్జున్ పుష్ప లాంటి బిగ్గెస్ట్ చిత్రాల రిలీజ్‌పై కూడా ఈ ఎఫెక్ట్ ఉండబోతుంది.ఇక వచ్చే సంక్రాంతి బరిలో రాబోతున్న సినిమాలపై కూడా ఆర్ఆర్ఆర్ ప్రభావం చూపుతుంది.

ముఖ్యంగా భీమ్లా నాయక్, సర్కారు వారి పాట చిత్రాలపై ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ పడనుండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.ఒక్క సినిమా రిలీజ్ వాయిదా ఇన్ని సినిమాలను ఆగం చేస్తుండటంతో ఆర్ఆర్ఆర్ రిలీజ్‌పై చిత్ర యూనిట్ ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube