దోస్తీ ఐడియా కార్తికేయదే.. షాక్ ఇచ్చిన రాజమౌళి ట్వీట్..!

ఆర్.ఆర్.ఆర్ సినిమా నుండి వచ్చిన దోస్తీ సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది.రాజమౌళి ప్రమోషనల్ సాంగ్ రేంజ్ కు తగినట్టుగా ఈ సాంగ్ ఉంది.

 Rrr Dosti Song Idea By Karthikeya-TeluguStop.com

ఐదు భాషల గాయకులతో కీరవాణి చేసిన మ్యూజిక్ ట్రీట్ సంగీత ప్రియులను అలరిస్తుంది.అయితే దోస్తీ సాంగ్ కు వచ్చిన ట్రెమండస్ రెస్పాన్స్ చూసిన ఆర్.ఆర్.ఆర్ డైరక్టర్ రాజమౌళి షాకింగ్ కామెంట్స్ చేశాడు.ఆర్.ఆర్.ఆర్ దోస్తీ సాంగ్ ఐడియా తనది కాదని కార్తికేయ ఈ సాంగ్ ప్లాన్ చేశాడని చెప్పారు.అంతేకాదు ఈ సాంగ్ డ్యాన్స్ కంపోజ్ చేసిన వారి గురించి ట్వీట్ చేశారు జక్కన్న.

 Rrr Dosti Song Idea By Karthikeya-దోస్తీ ఐడియా కార్తికేయదే.. షాక్ ఇచ్చిన రాజమౌళి ట్వీట్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కార్తికేయ డైరక్షన్ లోనే ఈ సాంగ్ షూట్ అంతా జరిగిందట.ఇంకో విషయం ఏంటంటే ఈ సాంగ్ షూట్ జరుగుతుంటే రాజమౌళి మాత్రం ఆర్.ఆర్.ఆర్ క్లైమాక్స్ షూట్ లో ఉన్నారట.మొత్తానికి రాజమౌళి వారసత్వానికి తగినట్టుగానే కార్తికేయ కూడా తన టాలెంట్ తో మెప్పిస్తున్నాడు.ఆర్.ఆర్.ఆర్ దోస్తీ సాంగ్ తో గుడ్ స్టార్ట్ ఇచ్చారని చెప్పొచ్చు.దోస్తీ సాంగ్ చూసిన ఎవరైనా ఈ సినిమా పక్కా బాహుబలి కాదు దాన్ని మించిన హిట్ అందుకుంటుందని చెప్పేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమాలో కొమరం భీం గా ఎన్.టి.ఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తున్నారు.

#RRR Dosti #Rajamouli #Ram Charan #RRR #Keeravani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు