ఆర్ఆర్ఆర్ సినిమా నచ్చలేదు.. తెగేసి చెప్పిన పవన్ కళ్యాణ్ హీరోయిన్?

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీ స్టార్ గా ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ సినిమా ఈ ఏడాది మార్చి 25న విడుదలై ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

 Rrr Did Not Lik The Movie Pawan Kalyan Said That The Heroine Rrr Movie, Did Not-TeluguStop.com

కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా ఇతర దేశాలలో కూడా ఈ సినిమా విడుదలయ్యి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఈ సినిమా చూసిన అనంతరం హాలీవుడ్ ప్రేక్షకులు హాలీవుడ్ దర్శకులు జక్కన్న పై ప్రశంసల వర్షం కురిపించారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా గురించి పవన్ కళ్యాణ్ హీరోయిన్ నికీషా పటేల్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

 Rrr Did Not Lik The Movie Pawan Kalyan Said That The Heroine RRR Movie, Did Not-TeluguStop.com

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆదరణ సంపాదించుకున్నటువంటి ఈ సినిమా ఈ ముద్దుగుమ్మకు ఏమాత్రం నచ్చలేదని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

నికిషా పటేల్ తెలుగులో పలు సినిమాలలో నటించి వరుస పరాజయాలను ఎదుర్కొన్నారు.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో కలిసి కొమరం పులి సినిమాలో నటించారు.ఈ సినిమా కూడా తనకు చేదు అనుభవాన్ని మిగిల్చడంతో ఈమె తమిళంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.ఇక్కడ కూడా తనకు చేదు అనుభవమే ఎదురవడంతో తిరిగి తన స్వదేశానికి వెళ్లారు.

ఇలా ఇండియాలో హీరోయిన్ గా వర్కౌట్ కాకపోవడంతో బ్రిటిష్ తిరిగి వెళ్ళినటువంటి నిఖీషా పటేల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన ఈమె తనకు ఈ సినిమా నచ్చలేదని తనకు ఈ సినిమా నచ్చలేదని విషయాన్ని తాను ధైర్యంగా ట్వీట్ చేస్తున్నా అంటూ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.ఈ క్రమంలోనే ఈ ట్వీట్ పై మెగా అభిమానులు నందమూరి అభిమానులు స్పందిస్తూ సినిమా నచ్చడం నచ్చకపోవడం వారి సొంత నిర్ణయం అయితే నచ్చలేదని విషయాన్ని ఇలా సోషల్ మీడియా వేదికగా వెల్లడించడంతో అభిమానులు నటిపై ట్రోల్స్ చేస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సినిమా తనుకు నచ్చకపోవడం ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube