ఆర్ఆర్ఆర్‌లో అవి చాలా చిన్నవట!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.

 Rrr Dialogues To Be Short But Impactful, Rrr, Ram Charan, Ntr, Rajamouli, Tollyw-TeluguStop.com

ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, చరణ్ రామరాజు పాత్రకు సంబంధించిన టీజర్ వీడియోకు స్టన్నింగ్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఎంతో ఆశగా చూస్తున్నారు.

కాగా ఈ సినిమాలో రాజమౌళి మార్క్ భారీ డైలాగులు ఉండబోవని తెలుస్తోంది.ఆర్ఆర్ఆర్‌లో ఇద్దరు హీరోలు పలికే డైలాగులు వన్ లైనర్ పంచ్‌‌లుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని తెలుస్తోంది.

ప్రముఖ రచయిత మధన్ కార్కి ఈ డైలాగులను రాస్తున్నారు.ఇక ఈ వన్ లైన్ డైలాగులను తారక్, చరణ్‌లు చెబుతుంటే ప్రేక్షకులకు గూస్‌బంప్స్ రావడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

కాగా ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, ఒలివియా మారిస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు.మరి ఈ సినిమాలోని డైలాగులను ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తాయో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube