సీడెడ్‌కు చుక్కలు చూపెట్టిన ఆర్ఆర్ఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ పీరియాడిక్ విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదలకు సిద్ధం అవుతుంది.

 Rrr Ceded Rights Sold For Bomb-TeluguStop.com

ఈ సినిమా విడుదల తేదిని కూడా ఈ మధ్యే చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

సౌత్ నుండి వస్తున్న మరో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా ఈ సినిమా ఎలాంటి క్రేజ్‌ను దక్కించుకుందో అందరికీ తెలిసిందే.

ఈ సినిమా ఇప్పటికే అదిరిపోయే క్రేజ్‌ను దక్కించుకోగా తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా హక్కులను సీడెడ్ ప్రాంతంలో అత్యంత భారీ ధరకు కొనుగోలు చేశారట బయ్యర్లు.ఆర్ఆర్ఆర్ కోసం ఏకంగా రూ.35 కోట్లు పెట్టి వాటి హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.ఈ ప్రాంతంలో ఇంత భారీ ధరకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడవ్వడం ఇదే ప్రథమం.

ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ మరో కీలక పాత్రలో నటిస్తుండగా అలియా భట్‌, ఒలివియా మారిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube