రాజమౌళి కంటే మా ప్రశాంత్ నీల్‌ గ్రేట్‌.. కారణం ఇదే

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.దాదాపుగా 550 కోట్ల నుండి 600 కోట్ల వరకూ బడ్జెట్తో ఆ సినిమా ను జక్కన్న తెరకెక్కించారు.

 Rrr And Kgf 2 Movie Collections And Directors Issue  ,  Film News ,  Kgf 2 ,  Pr-TeluguStop.com

ఆ సినిమా థియేట్రికల్ రైట్స్ ద్వారా దాదాపు వెయ్యి కోట్ల కు పైగా బిజినెస్ చేసింది.ఇప్పటికే ఈ సినిమా వెయ్యి కోట్ల కు పైగా వసూళ్ల ను సాధించిన విషయం తెలిసిందే.

ఇక మరో 200 నుండి 250 కోట్ల వరకు వసూలు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.అంటే మొత్తంగా ఈ సినిమా 1250 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు గా సమాచారం అందుతోంది.

కే జి ఎఫ్ 2 సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కన్నడ సినిమా గా రూపొంది విడుదల అయి ఈ సినిమా కు మొదటి వారం రోజుల్లో ఏకంగా ఏడు వందల కోట్ల రూపాయల వసూళ్లు నమోదయ్యాయి.

లాంగ్ రన్ లో ఈ సినిమా 1500 కోట్ల వసూళ్లను రాబడుతుంది అంటూ కన్నడ సినీ వర్గాల వారు చాలా ధీమాగా ఉన్నారు.అదే జరిగితే ఖచ్చితంగా రాజమౌళి పరువు గంగలో కలిసినట్లే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

కే జి ఎఫ్ 2 సినిమా దర్శకుడు వంద కోట్ల లోపు బడ్జెట్‌ తో పూర్తి చేశాడు.అలాంటిది ఏకంగా 1500 కోట్ల వసూళ్లు నమోదు చేయడం మామూలు విషయం కాదు.రూ.1500 కోట్ల వసూళ్లు నమోదు కాకుండా కనీసం 1000 కోట్ల వసూళ్లు నమోదు చేసినా కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా కంటే పది రెట్లు ఘన విజయం సాధించినట్టే అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కేజిఎఫ్ 2 బడ్జెట్ మరియు జక్కన్న మూవీ బడ్జెట్ కంపేర్ చేస్తే.వసూళ్లు కంపేర్ చేస్తే ఎవరి స్టామినా ఏంటో తెలిసిపోతుందని.దీన్నిబట్టి ప్రశాంత్ నీల్ ముందు మీ జక్కన్న నిలవలేక పోయాడు అంటూ కన్నడ సినీ అభిమానులు సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకులను రెచ్చగొట్టే విధంగా కామెంట్ చేస్తున్నారు.కన్నడ సినీ ప్రేక్షకులను మరియు సినీ వర్గాల వారు ఇప్పుడు ప్రశాంత్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube