కీరవాణి రాగంలో అసలు హీరోను మరిచిన ఆర్ఆర్ఆర్

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Rrr Team Forgets Alluri Seetharamaraju Birth Anniversary, Rrr, Alluri Seetharama-TeluguStop.com

ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని ప్రేక్షకులు చూస్తున్నారు.కాగా ఈ సినిమాలో తారక్ కొమురం భీం, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే చరణ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ కాగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.కానీ తాజాగా అల్లూరి సీతారామరాజు జయంతిని చిత్ర యూనిట్ మరిచిపోవడంతో అందరూ అవాక్కయ్యారు.

జూలై 4న సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఆయనకు బర్త్‌డే విషెస్ తెలియజేశారు.కానీ అదే రోజున అల్లూరి జయంతిని మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు.

దీంతో తెలుగు ప్రేక్షకులు అవాక్కయ్యారు.కాగా ఈ విషయాన్ని వారు సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

తమ సినిమాలో అల్లూరి కథ, పేరును వాడుకుంటున్న ఆర్ఆర్ఆర్ యూనిట్, ఆయన జయంతిని విస్మరించడం ఏమిటని పలువురు మండిపడుతున్నారు.ఏదేమైనా ఈ విషయంలో ఆర్ఆర్ఆర్ టీమ్ చేసిన పనిని ఎవరూ మెచ్చుకోవడం లేదు.

దీంతో చిత్ర యూనిట్ వెంటనే అల్లూరి జయంతిని గుర్తుకు చేసుకుంటూ ఓ పోస్ట్ పెట్టారు.కొద్దిలో తమ పరువు పోయేదని గుర్తించిన చిత్ర యూనిట్, వెంటనే తమ తప్పును తెలుసుకుని సరిచేసుకున్నారు.

ఏదేమైనా అల్లూరి జయంతిని మర్చిపోవడం అసాధ్యమైన పని అంటూ ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube