రామ పూజ కోసం వేచిఉన్న సీత.. లుక్ మాత్రం కేక!

టాలీవుడ్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.

 Alia Bhatt Look As Sita Revealed, Alia Bhatt, Sita, Ramaraju, Rajamouli, Tollywo-TeluguStop.com

ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో బాక్సాఫీస్ రికార్డులు షేక్ కావడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.
ఇక ఈ సినిమాలో రామరాజు పాత్రలో చరణ్ నటిస్తుండగా, ఆయనకు జోడీగా సీత పాత్రలో అందాల భామ ఆలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవలె ఆమె ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.దీంతో ఈ సినిమాలో ఆమె లుక్ పరంగా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

కాగా తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన లుక్‌ను ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.ఈ లుక్‌లో ఆలియా భట్ చాలా చక్కగా, రామరాజు కోసం ఎదురుచూస్తున్న సీతగా కనిపిస్తోంది.

ఆమె లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాను రఫ్ఫాడిస్తోంది.బాలీవుడ్‌లో గంగూబాయ్ కేతియావాడి అనే మహిళా డాన్ పాత్రలో నటించిన ఆలియా ఇలా పద్ధతిగా సీతగా కనిపించడంతో అటు బాలీవుడ్ జనాలు కూడా నోరెళ్లబెడుతున్నారు.
మొత్తానికి సీత పాత్ర కూడా ఈ సినిమాలో మామూలుగా ఉండబోదని చిత్ర యూనిట్ ఈ పోస్టర్‌తో తేల్చి చెప్పేశారు.ఇక ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో తారక్ విశ్వరూపాన్ని చూపించేందుకు రెడీగా ఉండగా, ఆయనకు జోడీగా ఐరిష్ బ్యూటీ ఒలివియా మారిస్ నటిస్తోంది.

ఈ సినిమాను అక్టోబర్ 13న రిలీజ్ చేస్తున్నట్లు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.మరి ఆర్ఆర్ఆర్ చిత్రం ఇండియాన్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తుందో తెలియాలంటే అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube