కత్తి దాడిపై సుత్తి కథలు ! ఈ సందేహాలు తీర్చండి బాస్   RP Thakur About Attack On YS Jagan     2018-10-26   10:29:01  IST  Sai M

ప్రస్తుత రాజకీయాలు , రాజకీయ నాయకుల తీరు వారి ప్రవర్తన రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. రాజకీయ కక్షలు ఉండవచ్చు కానీ … శత్రువు మీదైనా దాడి జరిగితే కొంత సానుభూతి వ్యక్తమవుతోంది. అయ్యో పాపం అంటాం … కాని నిన్న జరిగిన ఘటనలో అధికార తెలుగుదేశం పార్టీలో ఇది ఎక్కడా కన్పించలేదు. పైగా ఇదంతా కావాలని వారికివారే చేయించుకున్న దాడిలా సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పడం టీడీపీ చరిత్రను మసకబారేలా చేస్తోంది. జగన్ పై విశాఖలో జరిగిన దాడి గురించి టీడీపీ తప్ప అన్ని పార్టీలు విచారం వ్యక్తం చేశాయి. కానీ చంద్రబాబు మాత్రం కొంచెం వెకిలిగా ఆ సంఘటనను వెక్కిరిస్తున్నట్టు కనిపిస్తోంది.

దాడి జరిగింది సరే ఆ తరువాత టీడీపీ నాయకులు దగ్గర నుంచి పోలీస్ బాస్ వరకు పొంతనలేకుండా ఏవేవో చెప్పుకొచ్చారు. ఇక్కడే అనేక అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై టీడీపీ రకరకాల కథనాలు చెప్తూ ఆ మకిరి అంటుకోకుండా చూసుకుంటోంది. ఇక సంఘటనకు సంబంధించి అనేక అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

RP Thakur About Attack On YS Jagan-

దాడి చేసిన వ్యక్తి పేరు శ్రీనివాస్ ఇతను జగన్ గారి అభిమాని అని రెస్టారెంట్ ఓనర్ హర్షవర్ధన్ అంటున్నారు. అసలు ఈ హర్షవర్ధన్ మామూలు వ్యక్తి అయితే అతను చెప్పిన విషయాన్ని అందరూ నమ్మవచ్చు కాకపోతే అతను గతంలో టిడిపిలో ఎమ్మెల్యే సీటు ఆశించిన నాయకుడు. ఎయిర్ పోర్ట్ లోపల ఉన్న క్యాంటిన్‌లో ఎవ్వరికీ తెలియకుండానే సదరు నిందితుడు కత్తిని దాచాడు అంటే అది నమ్మశక్యంగా లేదు. జగన్‌పైన ఎటాక్ చేసిన మొత్తం వ్యవహారానికి క్యాంటీన్ ఓనర్ అయిన సదరు టిడిపి నాయకుడికి ఏ సంబంధం లేదు అని ఎలా తేల్చారు? కనీసం ఆ నాయకుడిని విచారించే ప్రయత్నం అయినా ఎందుకు చేయడం లేదు అనేది సందేహం కలిగిస్తోంది.

RP Thakur About Attack On YS Jagan-

జగన్ మీద అభిమానంతో ఫ్లెక్స్ కూడా పెట్టించాడని అంటున్నారు కానీ అసలు ఎక్కడైనా ఫ్లెక్స్ షాప్ వాళ్లు ఫ్లెక్స్ మీద షాపు పేరు ఫోన్ నెంబర్ వేస్తారు అలాంటిది ఏమిలేదు.
హత్యా యత్నం చేసిన వ్యక్తి రెడ్ హ్యాండెడ్ గా స్పాట్ లో మీకు దొరికినా, అతని జేబులో ఉంది అని మీరు చెప్పిన 10 పేజీల లెటర్ ను ఇన్ని గంటలు దాటుతున్న ఎందుకు బయట పెట్టడం లేదు ? హత్యా ప్రయత్నం జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఎటువంటి విచారణ చెయ్యకుండా డిజిపి ప్రెస్ మీట్ పెట్టి, హత్యా యత్నం చేసింది జగన్ అభిమాని అని ఎలా నిర్ధారణకు వచ్చేసారు..? పబ్లిసిటీ కోసమే ఈ హత్యాప్రయత్నం చేశాడు అని పోలీస్ బాస్ చెప్పడం ఇంకా ఇంకా అనుమానాలు కలిగిస్తోంది.